నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నాలుగో విడత వారాహి యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది.కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రారంభించిన ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై అదే విధంగా సీఎం జగన్( CM Jagan ) పై తనదైన శైలిలో కామెంట్లు చేశారు.రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.2024 తర్వాత ఏపీలో ప్రభుత్వం ఏర్పడేది జనసేన – టీడీపీ ప్రభుత్వమే అని ప్రకటించారు.జగన్ ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం అని అంటున్నారు.
అయితే ఆ కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం మీరు కౌరవులు.వందకి పైగా వైసీపీ( YCP ) వాళ్లు సభ్యులుగా ఉన్నారు.కాబట్టి వైసీపీ వాళ్ళు కౌరవులే.కురుక్షేత్రం అనే పదప్రయోగం మీకు నచ్చకపోతే.
కింగ్ జేమ్స్ బైబిల్ లో చెప్పినట్లుగా.దావీదు గొలియాతు యుద్ధంలా భావిద్దాం.
ఈ కథలో ఫిలిష్తీయుల తరుపున గొలియాతు అనే ఒక బలవంతుడు అహంకారంతో విర్రవీగుతుంటాడు.అటువంటి అహంకారంతో విర్రవీగుతున్న గొలియాతుని.14 సంవత్సరాల వయసు కలిగిన గొర్రెల కాపరి అయిన దావీదు ఎదుర్కొంటాడు.ఫిలిస్తీయుల దగ్గర కత్తులు కటార్లు ఆయుధాలు ఉంటే.
దావీదు చిన్న ఉండిలాతో… ఆ ఫిలిష్తీయుల ఆర్మీ తరపున వచ్చిన గొలియాతుని ఒక్క దెబ్బతో చంపేస్తాడు.సో జగన్ కి చెబుతున్న మీరు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం.
లేదు “దావీదు- గొలియాతు” యుద్ధమంటే అది.ఛాయిస్ మీకే ఇస్తున్న.మీరు అధికారంలో నుండి దిగటం… మేము అధికారంలోకి రావడం గ్యారెంటీ అని పవన్ ధీమా వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే అవనిగడ్డలో పవన్ వారాహి యాత్రపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ లో సెటైర్లు వేశారు.“1+1=2 గణితంలో.కొన్నిసార్లు రాజకీయాలలో 1+1=0 అవుతుందని ప్లాప్ అయినా అవనిగడ్డ “వరాహగళం” నిరూపించింది” అని పోస్ట్ పెట్టారు.