మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబుని పేర్కొన్నారు.
లంచాలు తిని కంచాలు మోగించడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు.
అవినీతి చేసిన చంద్రబాబు జైలుకు వెళ్లడంపై టీడీపీ శ్రేణుల్లో బాధ కనిపించడం లేదని పేర్ని నాని తెలిపారు.
చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారున కాబట్టే చాలా మంది టీడీపీ సభ్యులు ప్లేట్, గంటా మోగించలేదన్నారు.కోటి మంది టీడీపీ సభ్యులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.
జనం సొమ్మును దోచుకన్నోళ్లను అరెస్ట్ చేస్తే మోత మోగిస్తారా అని నిలదీశారు.ఈ క్రమంలోనే చంద్రబాబు తప్పు చేయకపోతే కోర్టు ఎందుకు రిలీఫ్ ఇవ్వడం లేదో చెప్పాలన్నారు.
బీజేపీ, టీడీపీ కలిసి ఏపీని మోసం చేశాయని ఆరోపించారు.గతంలో జగన్ ను అణచివేయాలని కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపారన్న పేర్ని నాని చంద్రబాబు ఇప్పుడు జైలుకు వెళ్తే ఎవరూ బాధపడటం లేదని తెలిపారు.








