మంచి మైలేజ్ ఇచ్చే బడ్జెట్ ధర కార్ల లిస్టు ఇదే.. బుక్ చేసుకోండి!

ప్రస్తుతం దైనందిత జీవితంలో ఓ కుటుంబం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ద్విచక్ర వాహనం కంటే కారులోనే వెళ్లడానికి మొగ్గు చూపుతోంది.దానికి కారణాలు లేకపోలేదు.

 Budget Cars List Which Gives Good Mileage Hyundai Exter Tata Tiago Details, Car-TeluguStop.com

మారిపోతున్న వాతావరణం కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, సౌకర్యవంతమైన ప్రయాణం కావచ్చు… ఇలా రకరకాల కారణాలతో సగటు మధ్య తరగతి వాడు కూడా ఓన్ వెహికల్ ఉండాలనుకుంటున్నారు.ఈ క్రమంలో కారును( Car ) కొనుగోలు చేయాలని చాలా మండి ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి.

ఈ క్రమంలోనే కార్ల కంపెనీలు సైతం సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా వివిధ మోడళ్లను తయారు చేస్తున్నాయి.

Telugu Cars, Mileage Cars, Budget Cars, Bussiness, Mileage, Hyundai Exter, Lates

మారుతి సుజుకీ నుంచి హ్యుందాయ్ వరకు తక్కువ ధర కార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసినదే.ఇదే సమయంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలు ఏమిటనేది తెలుసుకోవడం కూడా చాలా అవసరం.ఇపుడు మనం చెప్పుకోబోయే మోడళ్లు అన్నిరకాలుగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ లిస్టులో మొదటిది “హ్యుందాయ్ ఎక్స్ టర్.”( Hyundai Exter ) హ్యుందాయ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎక్స్ టర్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది అనుకోవడంలో సందేహమే లేదు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 19.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది.

Telugu Cars, Mileage Cars, Budget Cars, Bussiness, Mileage, Hyundai Exter, Lates

తరువాత “మారుతి ప్రెస్సో”( Maruti Presso ) గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి.దేశీయ ఆటోమోబైల్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి కంపెనీ నుంచి వచ్చిన ఈ మారుతి ఎస్-ప్రెస్సో వాహనదారులను బాగా ఆకట్టుకుంటోంది.1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన ఇది లీటర్ కు 25 కిలోమీటర్ల వరకు మేలేజ్ ఇస్తుంది.దీనిని రూ.6 లక్షల కంటే తక్కువ ధరకే పొందవచ్చు.చివరగా “టాటా టియాగో”( Tata Tiago ) గురించి చర్చించుకోక తప్పదు.టాటా కంపెనీ నుంచి అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో టియాగో ఒకటి.1199 సీసీ ఇంజన్ ను కలిగి ఉన్న ఈ కారు లీటర్ కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.సీఎన్ జీ వెర్షన్ లో 26 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.దీని ప్రారంభ ధర రూ.5 లక్షల నుంచి టాప్ వేరియంట్ రూ.8 లక్షలతో విక్రయిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube