పవన్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర షెడ్యూల్ ఇదే..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నాలుగో విడత వారాహి విజయ యాత్ర షెడ్యూల్ తాజాగా పార్టీ నేతలు  ప్రకటించడం జరిగింది.అక్టోబర్ మొదటి తారీకు నుంచి కృష్ణా జిల్లాలో( Krishna District ) వారాహి నాలుగో విడత విజయయాత్ర ప్రారంభం కాబోతున్నట్లు స్పష్టం చేశారు.

 This Is The Schedule Of Pawan Fourth Installment Of Varahi Vijaya Yatra Janasena-TeluguStop.com

కృష్ణాజిల్లా అవనిగడ్డ డిగ్రీ కళాశాలలో అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ నందు బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారట.ఆ తర్వాత రోజు  అక్టోబర్ రెండవ తారీకున కృష్ణాజిల్లా జనసేన పార్టీ నేతలతో భేటీ కాబోతున్నారు.

అక్టోబర్ మూడవ తారీకున జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు.అక్టోబర్ 4న పెడన, ఐదవ తారీకు కైకలూరులో వారాహి విజయయాత్ర( Varahi Vijaya Yatra ) చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు మూడు విడతలలో పవన్ వారాహి యాత్ర సాగింది.మొదటి విడత వారాహి యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగింది.రెండో విడత వారాహి యాత్ర ఏలూరు జిల్లాలో సాగింది.మూడో విడత వారాహి యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో సాగింది.

అయితే అక్టోబర్ మొదటి తారీకు నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర కృష్ణాజిల్లాలో నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు తాజాగా ప్రకటన చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube