జనగామ టికెట్ లొల్లి ముగిసిందా.. టికెట్ ఆ నేతకే ఇస్తున్నారా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ( Telangana Assembly Elections ) దగ్గరికి వస్తున్న కొద్ది అన్ని పార్టీలు టికెట్లు ప్రకటించే యోచనలో దూసుకుపోతున్నాయి.ఇందులో ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాల్లో టికెట్లను క్లియర్ చేసింది.

 Jangaon Ticket Fight Is Over.. Are You Giving The Ticket To That Leader , Mutth-TeluguStop.com

ఇంకా నాలుగు నియోజకవర్గాల్లో టికెట్లు ఆపింది.ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జనగామ ( Jangaon ) టికెట్.

ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి బిఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో గందరగోళం మొదలైంది.ఇదే తరుణంలో ఆ నియోజకవర్గము నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ కోసం ఆశిస్తున్నారు.

Telugu Brsjangaon, Mutthiyadagiri, Pallarajeshwar-Politics

అంతేకాకుండా జనగామ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పిటిసి లను హైదరాబాద్ రప్పించుకొని ఒక హోటల్లో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు.ఈ మీటింగ్ విషయం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి తెలియడంతో అది బట్టబయలైంది.దీంతో జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ( Palla Rajeshwar reddy ) కి వెళ్తుందనే సాంకేతాలు బలంగా వినిపించాయి.ఇదే తరుణంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా కేసిఆర్ ( KCR ) కేటీఆర్ నాకు టికెట్ కేటాయించక పోయిన నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటాననే ప్రచారాన్ని మొదలుపెట్టారు.

చివరి వరకైనా బీఫామ్ అందిస్తారనే ఆశతో ఉన్నారు.ఇదే తరుణంలో సీఎం కేసీఆర్ సెకండ్ లిస్టు కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది.

Telugu Brsjangaon, Mutthiyadagiri, Pallarajeshwar-Politics

ఈ లిస్టులో కూడా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ( Mutthireddy Yadagiri Reddy ) పేరు లేకపోవడంతో ఆయనకు టికెట్టు రాదనేది అర్థమయిపోయింది.100% పల్లా రాజేశ్వర్ రెడ్డి కి జనగామ టికెట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది.అధికారికంగా ప్రకటించకపోయినా పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy )ని ప్రచారం చేసుకోవాలని సాంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube