వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత ఆటగాళ్ళ అరుదైన రికార్డులు ఇవే..!

వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం అవ్వడానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంది.అక్టోబర్ 5న ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది.అయితే వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఖాతాలో ఉండే అరుదైన రికార్డులు ఏమిటో చూద్దాం.

 Indian Cricketers Records In Odi World Cup History Sachin Kohli Rohit Dravid Det-TeluguStop.com

కపిల్ దేవ్:

అతిపిన్న వయసులో వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన కెప్టెన్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.24 ఏళ్ల 17 రోజుల వయసులో కపిల్ దేవ్( Kapil Dev ) వన్డే వరల్డ్ కప్ టైటిల్ ని భారత్ కు అందించాడు.ఈ రికార్డు ఇప్పటివరకు బ్రేక్ కాలేదు.

సచిన్ టెండూల్కర్:

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) ఏకంగా తొమ్మిది సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచాడు.2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సచిన్ ఒకే ఎడిషన్ లో 673 పరుగులు చేశాడు.ఈ రికార్డులు ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు.

యువరాజ్ సింగ్:

2011 వన్డే వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్( Yuvraj Singh ) 362 పరుగులు చేయడంతో పాటు ఏకంగా 15 వికెట్లు తీశాడు.వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 350 కి పైగా పరుగులు చేసి ఏకంగా 15కి పైగా వికెట్లు తీసిన ఒకే ఒక ప్లేయర్ గా యువరాజ్ సింగ్ నిలిచాడు.

విరాట్ కోహ్లీ:

విరాట్ కోహ్లీ( Virat Kohli ) కెప్టెన్ గా 2019లో వన్డే వరల్డ్ కప్ లో ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు.ఒకే ఎడిషన్ లో ఐదు సార్లు 50 ప్లస్ స్కోర్ చేసిన ఏకైక కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు.

రోహిత్ శర్మ:

2019 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ( Rohit Sharma ) ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు.దీంతో ఒకే ఎడిషన్ లో ఐదు సెంచరీలు చేసిన రికార్డ్ సృష్టించాడు.

రాహుల్ ద్రావిడ్:

1999లో శ్రీలంకపై సెంచరీ చేసి వన్డే వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన ఏకైక భారత వికెట్ కీపర్ గా నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube