సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి నయనతార(Nayanthara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నయనతార ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈమె సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తాజాగా జవాన్ సినిమా(Jawan Movie).ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార తాజాగా జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మొదటి సినిమాతోనే అదే గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈమె కెరియర్ మొదట్లో కొంతమంది దర్శకులు అలాగే హీరోలతో లవ్ ఎఫైర్స్ కొనసాగించినప్పటికీ చివరికి డైరెక్టర్ విగ్నేష్(Vignesh) ను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.ఇక ఈ దంపతులు పెళ్లి అయినటువంటి నాలుగు నెలలకే సరోగసి ద్వారా తల్లిదండ్రులుగా మారిపోయారు.
ఇక తన పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి నయనతార వారికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక నయనతార తన ఇద్దరి కవల పిల్లలకు ఉయిర్(Uyir) ఉలగ్(Ulag)అని నామకరణం చేశారు.ఇక ఈ చిన్నారులకు ఏడాది పూర్తి కావడంతో వీరి పుట్టినరోజు వేడుకలను మలేషియాలో ( Malaysia ) కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వేడుకలో కవలల కోసం అడవి, జంతువుల నేపథ్య కేక్‌ని ప్రదర్శించారు, దాని చుట్టూ నీలం, తెలుపు బెలూన్లు ఉన్నాయి.ఇలా నయనతార తన కుమారుల మొదటి పుట్టినరోజు వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారని ఈ ఫోటోలు చూస్తుంటే అర్థం అవుతుంది.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.