చరణ్ పదహారేళ్ల సినీ కెరియర్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన ఉపాసన...పోస్ట్ వైరల్!

చిరంజీవి ( Chiranjeevi ) వారసుడిగా ఇండస్ట్రీలోకి చిరుత సినిమా( Chirutha ) ద్వారా హీరోగా పరిచయమయ్యారు నటుడు రామ్ చరణ్ ( Ramcharan ) .చిరుత సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అద్దకు ఉన్నటువంటి ఈయన అనంతరం మగధీర సినిమాలో నటించారు.

 Upasana Interesting Post About Ramcharan 16 Years Cini Journey , Ramcharan, Up-TeluguStop.com

ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రామ్ చరణ్ కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు సంపాదించుకున్నారు.

చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందగా రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 సంవత్సరాలు పూర్తి కావడంతో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు సెప్టెంబర్ 28వ తేదీ ఈయన తన మొదటి చిరుత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.దీంతో ఈయన 16 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే ఉపాసన ( Upasana ) సైతం చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉపాసన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా రామ్ చరణ్( Ramcharan ) ఫోటోని షేర్ చేస్తూ స్వీట్ 16, రామ్ చరణ్‌కు 16 ఏళ్లు అంటూ క్యాప్షన్‌తో ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేసింది .అదే విధంగా రామ్ చరణ్ సినిమాలకు థియేటర్లలో థియేటర్ల ముందు అభిమానులు చేసినటువంటి హంగామాకు సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా ఈమె షేర్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా రాంచరణ్ 16 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకోవడంతో ఉపాసన స్పెషల్ విషెస్ తెలియజేశారు.

ఇక ఉపాసన రాంచరణ్ వివాహ బంధానికి 11 సంవత్సరాలు అనే విషయం మనకు తెలిసిందే.ఇలా వీరి వివాహం జరిగిన 11 సంవత్సరాలకు ఈ జంట ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube