సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ‘‘గుంటూరు కారం”.( Guntur Kaaram ) ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయనున్నాడు.ఇలా వరుస లైనప్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు గురించి ఒక టాక్ నెట్టింట వైరల్ అవుతుంది.మహేష్ కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో హిట్స్ మాత్రమే కాదు అంతకు మించి ప్లాప్స్ సైతం ఉన్నాయి.
అన్ని తట్టుకుని సూపర్ స్టార్ గా నిలబడ్డాడు.అయితే ఈయన తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు.తనకు సూట్ కావని కొన్ని, షెడ్యూల్ కుదరక కొన్ని వదులు కున్నాడు.
అయితే తాజాగా ఈయన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ”యానిమల్’‘ ( Animal )ను సైతం వదులుకున్నట్టు నిన్నటి నుండి నెట్టింట ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.గతంలో మహేష్ బాబుకు సందీప్ రెడ్డి ఒక కథ వినిపించాడు అని టాక్ వచ్చింది.అయితే మహేష్ బాబు నో చెప్పిన కథ తోనే రణబీర్( Ranbir Kapoor ) తో యానిమల్ సినిమాను తీసాడు అని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.తాజాగా యానిమల్ నుండి టీజర్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది.
మరి అలాంటి సినిమాకు మహేష్ వదులుకున్నాడా అని ఫ్యాన్స్ తెగ చర్చించు కుంటున్నారు.ఇందులో నిజమెంత ఉందో వేచి చూడాల్సిందే.