మహారాష్ట్ర కుర్రాడు సంచలనం.. నీళ్లు లేకుండా 60 రోజుల పాటు పేస్ట్ తో మొక్కలను బ్రతికిస్తూ?

సాధారణంగా నీళ్లు లేకుండా పంటలను పండించడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.పంటల పెట్టుబడులు పెరుగుతున్న స్థాయిలో రైతుల ఆదాయం మాత్రం పెరగడం లేదు.

 Crop Without Water Prakash Sunil Pawar Success Story Details Here Goes Viral I-TeluguStop.com

అయితే మహారాష్ట్ర కుర్రాడు తన కష్టంతో ఒక కొత్త రకం పేస్ట్ ను తయారు చేశారు.ఈ పేస్ట్ సహాయంతో మొక్కలను 45 రోజుల నుంచి 60 రోజుల పాటు బ్రతికించే అవకాశం అయితే ఉంటుంది.

ఈ ప్రయోగం ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడాల్సి ఉంది.

Telugu Corn, Crop, Farmers, Maharashtra, Prakashsunil, Story, Young-Inspirationa

ప్రకాశ్ సునీల్ పవార్( Prakash sunil pawar ) ఎంతో కష్టపడి ఆకుపచ్చని పేస్ట్ ను తయారు చేశాడు.వర్షాభావ పరిస్థితులలో మొక్కలకు ఈ పేస్ట్ ను పట్టించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.మొక్కజొన్న( Corn ), నీటి శాతం ఎక్కువగా ఉండే మరో పదార్థంతో ఈ పేస్ట్ ను తయారు చేశారని తెలుస్తోంది.

ఈ ఆవిష్కరణకు ప్రకాశ్ సునీల్ పవార్ 20 సంవత్సరాల పేటెంట్ పొందడం గమనార్హం.

Telugu Corn, Crop, Farmers, Maharashtra, Prakashsunil, Story, Young-Inspirationa

ప్రకాశ్ సునీల్ పవార్ మహారాష్ట్ర రాష్ట్రంలోని బ్రాహ్మణ్ షెవ్ గే గ్రామానికి చెందినవారు.రైతుల కష్టాలను తీర్చాలనే ఉన్నతమైన లక్ష్యంతో ప్రకాశ్ సునీల్ పవార్ ఈ ఉత్పత్తిని కనిపెట్టారు.మరికొన్ని నెలల తర్వాత ఈ పేస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ప్రకాశ్ సునీల్ పవార్ పరిశోధనలను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.రైతుల( Farmers ) కష్టాలకు చెక్ పెట్టే మరికొన్ని పరిశోధనల దిశగా ప్రకాశ్ సునీల్ పవార్ అడుగులు వేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రకాశ్ సునీల్ పవార్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.ప్రకాశ్ సునీల్ పవార్ ఆవిష్కరణ గురించి దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ప్రకాష్ లా మరింత మంది సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube