దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారగ గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి నయన తార ఒకరు.నయనతార ( Nayanatara ) ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎన్నో మంచి అవకాశాలను అందుకొని హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా ఈమె బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ( Shahruka Khan ) సరసన జవాన్( Jawan ) సినిమాలో నటించి బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చారు.ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.కెరియర్ మొదట్లో పలువురి హీరోలతో ఈమె లవ్ ఎఫైర్స్ కొనసాగించిన అనంతరం వారందరికీ బ్రేకప్ చెప్పి దర్శకుడు విగ్నేష్ ( Vignesh ) తో ప్రేమలో ఉంటూ ఆయనని గత ఏడాది వివాహం చేసుకున్నారు.
ఇలా వివాహమైన వెంటనే ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు.ప్రస్తుతం ఈ పిల్లలతో నయనతార విగ్నేష్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక ఈ చిన్నారులకు సంబంధించిన ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేసే నయనతార విజ్ఞప్తి కూడా వారి ఫేస్ మాత్రం చూపించలేదు వీరికి ఏడాది కావడంతో మొదటి పుట్టిన రోజు సందర్భంగా ఈ దంపతులు తమ పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు దీనితో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి.ఇలా నయనతార పిల్లలు చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేశారు.ఇక నయనతార తన కడుపున పిల్లలను మోసి కనక పోయిన ఆమె కూడా అమ్మగా మారడంతో ఎంతోమంది పిల్లల గురించి ఆలోచిస్తూ తన కొడుకుల పుట్టినరోజు సందర్భంగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
తమ కొడుకుల పుట్టినరోజు సందర్భంగా నయన తార విగ్నేష్ దంపతులు దాదాపు 100 అనాధ శరణాలయాలలో ఫుడ్ బట్టలు డొనేట్ చేయించిందట.వీటికి దాదాపు 60 – 70 లక్షల పైగానే ఖర్చు అయినట్లు కూడా తెలుస్తుంది.అంతేకాదు నయనతార తన పిల్లల ప్రతి పుట్టినరోజుకు ఇదే పని చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఇలా తన పిల్లల ప్రతి పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమాలలో పిల్లలకు ఫుడ్డు అలాగే వారికి బట్టలను పంపిణీ చేయాలని నయనతార తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై ఎంతో మంది ప్రశంసల కురిపిస్తున్నారు.ఇది ఒక గొప్ప నిర్ణయం అని కామెంట్లు చేస్తున్నారు.