బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఈమేనా.. అయ్యో పాపం అంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss 7 Telugu ) కు లేడీ కంటెస్టెంట్లు కలిసిరావడం లేదు.ఇప్పటికే వరుసగా మూడు వారాల పాటు లేడీ కంటెస్టెంట్లు ఎలిమేనేట్ కాగా ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.

 Bigg Boss Season7 Fourth Week Eliminated Contestant Details Here Goes Viral In S-TeluguStop.com

తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రియాంక జైన్( Priyanka jain ) ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు.ఈ విషయం తెలిసి నెటిజన్లు అయ్యో పాపం అని కామెంట్లు చేస్తున్నారు.బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో లాంఛింగ్ ఎపిసోడ్ రేటింగ్స్( Bigg Boss Show Launch ) అదుర్స్ అనేలా ఉండగా మిగతా ఎపిసోడ్స్ మాత్రం రేటింగ్స్ విషయంలో తీవ్రస్థాయిలో నిరాశపరుస్తున్నాయి.ప్రోమోలు బ్లాస్ట్ అయ్యేలా ఉండగా ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 కూడా ఫ్లాప్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు హోస్ట్ ను మారిస్తే బెటర్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

నాగార్జున( Nagarjuna ) సరిగ్గా న్యాయం చేయలేకపోవడం వల్లే ఈ షో పరిస్థితి ఇలా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ షోకు బదులుగా ఇదే తరహాలో మరో షోను ప్లాన్ చేస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఒకే తరహా షోను చూసీచూసీ బోర్ కొడుతోందని కంటెస్టెంట్లకు ఇచ్చే టాస్క్ లు( Bigg Boss Show Tasks ) మారడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ షోను చూడటమే మానేశామని మరి కొందరు చెబుతున్నారు.రాత్రి 9.30 గంటలకు ప్రసారమవుతూ ఉండటం వల్ల కూడా కొంతమంది ఈ షోపై ఆసక్తి చూపించడం లేదు.రాబోయే రోజుల్లో అయినా ఈ షో ప్రేక్షకులను మెప్పించడం సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube