టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ ( Chandrababu arrest )అయిన దగ్గర నుంచి ఏపీలో రాజకీయ దుమారం రేగుతూనే ఉంది.ముఖ్యంగా ‘దోమల ‘ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి .
అలాగే మీడియా లోనూ అనేక డిబేట్లు జరుగుతున్నాయి.స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ అయిన టిడిపి( TDP ) అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.
చంద్రబాబు జైలుకు వెళ్లి ఇప్పటికే 19 రోజులు అవుతుంది .ఒకవైపు ఆయన బెయిల్ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి .ఇప్పటికే ఈ వ్యవహారం పై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోను పిటీషన్లు దాఖలు అయ్యాయి.చంద్రబాబు( Chandrababu ) ఎప్పుడు బెయిల్ పై విడుదల అవుతారా అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉంటే ఈనెల 11 నుంచి సెంట్రల్ జైల్లోని ప్రత్యేక బ్యారక్ లో ఉంటున్న చంద్రబాబుకు సరైన వసతులు కల్పించడం లేదని, దోమలు( Mosquitoes ) ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు భార్య భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) తో పాటు, టిడిపి కీలక నాయకులంతా అనేక ఆరోపణలు చేస్తున్నారు .జైల్లో చంద్రబాబును దోమలు కుడుతున్నా, అధికారులు పట్టించుకోవడంలేదని, అసలు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు ఉన్న జైలు గదిలో దోమలను వదులుతున్నారని అనేక ఆరోపణలు చేస్తున్నారు.దీనిపై పెద్ద రాద్ధాంతమే చోటు చేసుకున్న నేపథ్యంలో, ఈ వ్యవహారానికి పులిస్టాప్ పెట్టేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు రంగంలోకి దిగారు.ఈ మేరకు జైలు పరిసరాల చుట్టు దోమల నియంత్రణకు చర్యలు చేపట్టారు .జైలు చుట్టూ అధికారులు పెద్ద ఎత్తున దోమల ఫాగింగ్ చేయించారు .దోమలు బెడద తగ్గించేందుకు ఎప్పుడు లేని విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.
సెంట్రల్ చుట్టూ పెద్ద ఎత్తున వృక్షాలు ,మొక్కలు ఉండడంతో దోమలు బెడద ఎక్కువగా ఉందని, అందుకే ఖైదీల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు.జైలు ప్రాంగణంతో పాటు, పరిసరాలు, చెట్లు , పొదల్లో సైతం మున్సిపల్ సిబ్బంది పాగింగ్ కార్యక్రమం చేపట్టారు.