ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతినిధి బృందం కు అమెరికాలోని వాషింగ్టన్ డిసి( Washington ) లో ఉన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి కార్యాలయ అధికారులు ప్రశంసలు కురిపించారు.ప్రస్తుతం ఏపీ విద్యార్థుల ప్రతినిధి బృందం అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో వాషింగ్టన్ డిసి లో ఉన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్ ) కార్యాలయాన్ని తాజాగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీత గోపీనాథ్ తో పాటు భారతదేశ ఐ ఎం ఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె సుబ్రమణియన్( K Subramanian ) తో విద్యార్థులు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఏపీ విద్యార్థుల ప్రతినిధి బృందాన్ని ఐఎంఎఫ్ అధికారులు ప్రశంసించారు.

విద్యార్థులతో పాటు ఏపీ ప్రభుత్వ విధానాలను వారు ప్రశంసించారు.ఏపీ ప్రభుత్వం మానవ వనరులపై పెట్టుబడులు పెడుతుండడం ప్రశంసనీయమని వారు అన్నారు.దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఏపీ ప్రభుత్వ విధానాలను అనుసరించాలని ఐఎంఎఫ్ అధికారులు సూచించారు .విద్యార్థులు ఆత్మస్థైర్యం , దృఢ సంకల్పంతో చదువుకుని భారతదేశం కోసం కొత్త ఉత్సాహంతో పనిచేసి, దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని భారత ఐ ఎం ఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు.విద్యార్థులు జీవితంలో ఎలా విజయం సాధించాలనే దానిపై మార్గదర్శకత్వం, సూచనలను స్వీకరించడం గొప్ప విషయం అని అన్నారు.ఈ సందర్భంగా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన గీతా గోపీనాథ్( Gita Gopinath ), ఐఎంఎఫ్ లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి వచ్చేవరకు చేసిన కృషిని, తాను ఎదిగిన క్రమాన్ని విద్యార్థులకు వివరించారు.

ఏపీ విద్యార్థులు మనోత్సర్యాన్ని నింపిన గీతా గోపీనాథ్, సుబ్రహ్మణ్యం ల కృషిని ప్రశంసిస్తూ ఏపీ సీఎం కార్యాలయం సైతం వారికి కృతజ్ఞతలు తెలిపింది.ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయి వేదికను అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పర్యటన అంతర్జాతీయ ఆర్థిక సంస్థల పనితీరును గురించి తెలుసుకునేందుకు విద్యార్థులకు ఒక మంచి అవకాశంగా నిలిచింది
.






