తెలంగాణలో ఎన్నికలు( Elections in Telangana ) దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి పెరుగుతోంది.ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రచారానికి కసరత్తులు చేస్తోంది.
కానీ కాంగ్రెస్ బీజేపీ ( Congress, BJP )పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికపైనే తర్జన భర్జన పడుతూ ఉన్నాయి.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్తుల ఎంపిక గత కొన్నాళ్లుగా జరుఘున్నప్పటికి ఓ కొల్లిక్కి రావడం లేదు.
అభ్యర్థుల ఎంపికలో ముఖ్య భూమిక పోషించి స్క్రినింగ్ కమిటీ ఇప్పటికే పలు మార్లు భేటీ అయినప్పటికి తుది నిర్ణయానికి రాలేకపోతున్నారట.దీనికి ప్రధాన కారణం పొత్తు విషయంలో నెలకొన్న సందిగ్ధతే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
టి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.
కానీ కమ్యూనిస్ట్ పార్టీలు( Communist parties ) మాత్రం సీట్ల కేటాయింపులో మాత్రంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.సిపిఎం కు 3 సీట్లు సిపిఐ కు రెండు సీట్లు మొత్తం మీద వామపక్ష పార్టీలకు ఐదు సీట్లు కేటాయిస్తేనే పొత్తుకు ఒకే అంటున్నారట కమ్యూనిస్ట్ పార్టీ నేతలు.అయితే కమ్యూనిస్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్న సీట్లు కూడా కాంగ్రెస్ కు అత్యంత కీలకమైనవి కావడంతో హస్తం పార్టీ పొత్తు విషయంలో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
పాలేరు, భద్రాచలం, కొత్తగూడెం, మునుగోడు, వైరా వంటి సీట్లను కమ్యూనిస్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయట.
ప్రస్తుతం పాలేరు, కొత్తగూడెం( Paleru, Kothagudem ) వంటి సీట్లలో కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావ్ వంటి వారు రేస్ లో ఉన్నారు.ఇంక వైరా మునుగోడు వంటి సీట్లలో హస్తం పార్టీకి మంచి ఆధారణ ఉంది.దీంతో కాంగ్రెస్ కు అత్యంత బలమైన సీట్లనే వామపక్షాలు డిమాండ్ చేస్తుండడంతో అసలు పొత్తు పెట్టుకోవాలా లేదా అని దానిపై హస్తం నేతలు మల్లగుల్లాలు అప్డుతున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఎప్పుడో బహిర్గతం చేయాల్సిన మొదటి జాబితా సీట్లను ఇంతవరకు హస్తం పార్టీ బయటపెట్టలేదని టాక్ వినిపిస్తోంది.వామపక్షలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై ఓ క్లారిటీ వస్తే ఆ వెంటనే తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి సిద్దమౌవ్వాలని హస్తం పార్టీ భావిస్తోంది.
మరి సీట్ల పంపకలలో సయోద్య కుదురుతుందో లేదో చూడాలి.