నాగార్జున( Nagarjuna ) హీరో గా వచ్చిన చాలా సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి అందులో హలో బ్రదర్ ( Hello brother )ఒకరు.ఈయన చేసిన ఈ సినిమాలో ఇద్దరు నాగార్జునలు ఉండటం అందులో ఇద్దరు కూడా ఒకరు ఏది చేస్తే మరొకరు కూడా అదే చేయడం లాంటివి ఈ సినిమా చూసిన ప్రేక్షకులకి అవి చాలా కొత్తగా అనిపించింది దాంతో ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

ఇక ఈ సినిమాని అప్పట్లో ఇవివి సత్య నారాయణ ( E.v.v Satya Narayana )గారు తీసి మంచి విజయాన్ని అందుకున్నారు.అయితే ఇవివి గారు ఈ సినిమాని శ్రీకాంత్( Srikanth ) తో చేద్దాం అని అనుకున్నారట.
అప్పట్లో వీళ్లిద్దరూ కూడా చాలా సినిమాలు కలిసి తీశారు కాబట్టి వీళ్ళ మధ్య ఉన్న మంచి ర్యాపో తో ఈ సినిమా కూడా ఆయనతోనే చేద్దాం అని చూస్తే అంతలోకి ఈ సినిమా మధ్యలో నాగార్జున దగ్గరికి వెళ్ళింది…ఈ సినిమా చాలా మంచి హిట్ అయింది దీంతో నాగార్జున నటుడుగా మరో మెట్టు పైకి ఎక్కారు అనే చెప్పాలి.ఇక ఈ సినిమా అప్పట్లో నాగార్జున కి మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమాగా కూడా ఈ సినిమాని చెప్పవచ్చు ఇక ఇలాంటి సినిమా తన కెరియర్ లో చేయడం నిజంగా తన అదృష్టం అని నాగార్జున కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది.

ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున చేసిన చాలా సినిమాలు వరుసగా విజయం సాధించాయి.దాంతో నాగార్జున ఇండస్ట్రీ లో ఒక స్టార్ గా తన పేరు ని సుస్థిరం చేసుకున్నాడు…ఇక ఈ సినిమా లో నటించిన రమ్య కృష్ణ తో వరుసగా అన్నమయ్య, ఘరానా బుల్లోడు,క్రిమినల్ లాంటి సినిమాలు చేసాడు.అప్పట్లో నాగార్జున అంటే లేడీస్ ఎక్కువగా ఇష్టపడే వారు.








