మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) ఇప్పటికి ఏడాదికి రెండు నుండి మూడు సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.ఈ ఏడాది అప్పుడే రెండు సినిమాలు రిలీజ్ చేయగా మూడవ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుని మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడు.

మరి ఇప్పుడు రిలీజ్ కు రెడీగా పెట్టిన సినిమా ”టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao )”.నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్, సాంగ్ కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.
కాగా ఇప్పుడు టైగర్ నుండి ఫ్యాన్స్ కు అదిరిపోయే కిక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.

మాస్ రాజా రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనలతో 1970ల కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇక రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.ఈ ట్రైలర్ ను అక్టోబర్ 3న రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా తెలిపారు.
రవితేజ మరో మాస్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఇది బాగా ఆకట్టు కుంటుంది.ఇక పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్( Gayatri Bhardwaj ) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇక అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మన్హసి విజయం సాదిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.
మరి రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.







