ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఎలక్ట్రిక్ వన్( Electric One ) భారతదేశంలో E1 ఆస్ట్రో, E1 ఆస్ట్రో ప్రో అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.E1 ఆస్ట్రో ధర రూ.99,999, E1 ఆస్ట్రో ప్రో ధరను రూ.1,24,999 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.రెడ్ బెర్రీ, బ్లేజ్ ఆరెంజ్, ఎలిగెంట్ వైట్, మెటాలిక్ గ్రే, రేసింగ్ గ్రీన్ అనే ఐదు రంగులలో స్కూటర్లు అందుబాటులో ఉంటాయి.
మొదట, స్కూటర్లు గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి ఐదు రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఎలక్ట్రిక్ వన్ 20 రాష్ట్రాలకు విస్తరించాలని, భారతదేశంలో 100 షోరూమ్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది.కంపెనీ శ్రీలంక, నేపాల్‌లోకి కూడా ప్రవేశించాలని ప్లాన్ చేస్తుంది.స్కూటర్లు ఎక్స్‌టెండెడ్ వారంటీ, అన్ని క్లిష్టమైన భాగాల కోసం “నో క్వశ్చన్స్ ఆస్క్డ్” రీప్లేస్‌మెంట్ పాలసీతో వస్తాయి.
రెండు స్కూటర్లు 2400 W మోటార్‌తో లాంచ్ అయ్యాయి.వీటి టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు.ఇవి 72 V లిథియం-అయాన్ బ్యాటరీతో నడుస్తాయి.వీటిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 నుండి 4 గంటలు పడుతుంది.E1 ఆస్ట్రో( E1 Astro ) 100 కి.మీల రేంజ్ ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.అయితే E1 ఆస్ట్రో ప్రో( E1 Astro Pro ) అడ్వెంచర్ S బ్యాటరీ ప్యాక్‌తో 120 కి.మీ, 200 కి.మీ.రేంజ్ అందిస్తుందట.
ఎలక్ట్రిక్ వన్ సీఈఓ మాట్లాడుతూ, భారతదేశంలో ఆస్ట్రో సిరీస్‌ను విడుదల చేయడానికి కంపెనీ ఉత్సాహంగా ఉందని, ఈ హై-క్వాలిటీ స్కూటర్లు వాల్యూ ఫర్ మనీ అవుతాయని నమ్ముతున్నట్లు తెలిపారు.