తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కమెడియన్స్ అయిన హీరోలైన ఆఖరికి హీరోయిన్స్ అయిన కూడా కొన్ని అలవాట్లు పద్ధతులు పాటిస్తూ ఉంటారు.అలా సోషల్ లైఫ్ లో ఎక్కువగా మూవ్ అయ్యే వారికి అవకాశం ఎక్కువగా వస్తాయనేది కొందరి నమ్మకం.
అలాగే నలుగురులోకి వెళ్ళినప్పుడు ముడుచుకుని కూర్చున్నా కూడా జనాలు అవహేళన చేస్తారని భావన కూడా మరికొంత మందిలో ఉంటుంది.అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ గా అత్యంత టాప్ పొజిషన్ లోకి వెళ్లిన కొంతమంది మాత్రం ఇప్పటి వరకు చుక్క మందు కూడా తాగలేదట.ఆ కమెడియన్స్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బ్రహ్మానందం
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే దిగ్గజ కమెడియన్ అయినటువంటి బ్రహ్మానందం( Brahmanandam ) నాటి నుంచి నేటి వరకు మందు ముట్టుకోలేదట.సినిమాల్లో కావలసినంత అవకాశాలు ఉండగా జీవితాన్ని నాశనం చేసే మందును మాత్రం ఎందుకు దగ్గరికి రానివ్వాలి అనేది బ్రహ్మానందం యొక్క ఫిలాసఫీ.
ఆలీ
బ్రహ్మానందం మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నటువంటి ఆలీ( Mohammad Ali ) సైతం ఇప్పటివరకు మందు తాగలేదని విషయం ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకోవడం విశేషం.తన మతంలో మందు అనేది నిషిద్ధమని కూడా ఆలీ తెలుపుతున్నారు.
ఏవీఎస్
లివర్ డ్యామేజ్ తో కన్నుమూసిన టాలీవుడ్ కమెడియన్ ఏవీఎస్( AVS ) మందు తాగడం వల్ల చనిపోయారని కొంతమంది అంటూ ఉంటారు కానీ ఆయన కుమారుడు చెప్పిన వివరాల ప్రకారం తన తండ్రికి మందు అలవాటు లేదని అకేషనల్ గా కూడా తాగేవాడు కాదని ఆయన లివర్ డ్యామేజ్ కావడానికి గల కారణాలేంటో తెలియలేదని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.వీరు మాత్రమే కాదు… టాలీవుడ్ ఇండస్ట్రీల చాలామంది హీరోలు అలాగే దర్శకులు సైతం మందు ముట్టుకోరు.వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా వారు కూడా మందు మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుందనేది వారి అభిమానుల ఆవేదన
.