యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రాలలో ఒకటి ‘సలార్‘( Salaar ).కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) తెరకెక్కిస్తున్న చిత్రం కావడం తో ఈ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడా చూద్దామా అనే ఆత్రుత మొదలైంది.
అందుకు తగ్గట్టుగా ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్ అంచనాలను పదింతలు ఎక్కువ చేసింది.అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఈపాటికి ఎల్లుండి విడుదల అయిపోయి ఉండేది.
ఎక్కడ చూసిన అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియా నిండిపోయేది.కానీ అది జరగలేదు, ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టుగా గత కొద్దిరోజుల క్రితమే మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు.
దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ మొత్తం అయ్యోమయ్యం లో పడ్డారు.
ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన చిత్రాన్ని ఆపేయడం ఏమిటి.?, అసలు ఏమి జరుగుతుంది అంటూ కంగారు పడ్డారు.సినిమా ఔట్పుట్ ఇంకా బెటర్ గా రావాలనే ఉద్దేశ్యం తో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు.
అంటే ఈ సినిమా బాగా రాలేదా?, అయితే ప్రభాస్ గత మూడు చిత్రాలు లాగానే ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందా అంటూ అభిమానులు సోషల్ మీడియా ( Social media )లో కంగారు పడ్డారు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ రీ షూటింగ్ కి ఏర్పాట్లు మొత్తం చేసున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
ప్రభాస్ కి రీసెంట్ గానే మోకాళ్ళ సర్జరీ జరిగింది.ఆయన కోలుకొని రాగానే ఈ సినిమా క్లైమాక్స్ ని చిత్రీకరిస్తారు.
ముందు తీసిన క్లైమాక్స్ మొదటి కాపీ చూస్తున్న సమయం లో చాలా చెత్తగా అనిపించింది అని, అందుకే ప్రశాంత్ నీల్>( Prashanth Neel ) ఈ నిర్ణయం తీసుకొని ఆలస్యం అయినా పర్వాలేదు, ఔట్పుట్ ముఖ్యం అంటూ వాయిదా వేసాడట.
కేవలం క్లైమాక్స్ సన్నివేశం మాత్రమే కాదు , పార్ట్ 2 కి సంబంధించి కొన్ని లీడింగ్ సన్నివేశాలు కూడా చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.మిగతా సినిమా ఔట్పుట్ విషయం లో అసలు కంగారు పడాల్సిన అవసరం లేదని, కచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిలను కొల్లగొట్టే రేంజ్ కంటెంట్ అని ప్రభాస్ సన్నిహితులు చెప్తున్నారు.అయితే ఇంతకు ముందు ఉన్నంత బిజినెస్ ఈసారి ఈ చిత్రానికి ఉండకపోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
సెప్టెంబర్ 28 వ తారీఖున ఈ చిత్రం విడుదల అయ్యుంటే సోలో గ్రౌండ్ దొరికి ఉండేది.ఎలాంటి పోటీ ఉండేది కాదు, కానీ డిసెంబర్ 22 వ తేదీన విడుదల అంటున్నారు.
అదే రోజు షారుఖ్ ఖాన్ ‘దుంకీ’ చిత్రం విడుదల అవుతుంది.ఓవర్సీస్ లో రెండు మూడు ప్రెస్టీజియస్ హాలీవుడ్ మూవీస్ కూడా విడుదల అవుతాయి, కాబట్టి ముందు చెప్పిన ఫ్యాన్సీ ప్రిన్స్ కి అమ్ముడుపోయే ఛాన్స్ లేదని అంటున్నారు.