తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ విప్ సుంకరి రాజు, ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పటేల్, సినీ నిర్మాత దిల్ రాజు తదితరులు వేరువేరుగా దర్శించి వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.