ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తెలంగాణ హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది.గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులను చూపకుండా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని సైని సతీష్ పిటిషన్ లో పేర్కొన్నారు.కాగా ఇందులో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గొంగిడి సునీత కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అనంతరం ఆమెకు రూ.10 వేల జరిమానా విధించింది.అదేవిధంగా అక్టోబర్ 3వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.తరువాత తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.







