Suresh : అమ్మోరు సినిమా నాకు నాలుగు గొప్ప విషయాలను ఇచ్చింది : హీరో సురేష్

అమ్మోరు సినిమా (Ammoru movie )సౌందర్య మొట్టమొదటగా నటించిన సినిమా.కానీ ఆ చిత్రం ఆమె చేసిన తర్వాత మూడేళ్లకు విడుదల అయ్యింది.

 Actor Suresh About Ammoru Movie-TeluguStop.com

ఆలా సౌందర్య డెబ్యూ మూవీ ఆరో సినిమాగా వచ్చింది.ఈ సినిమాలో సౌందర్య సరసన నటుడు సురేష్( Suresh ) హీరో గా చేసారు.

సురేష్ అలీ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అమ్మోరు సినిమా తన జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో చెప్పుకోచ్చారు.మొట్ట మొదటగా సౌందర్య లాంటి గొప్ప హీరోయిన్ తో నటించడం అయన పూర్వ జన్మ సుకృతం అన్నారు.

ఆ తర్వాత సౌందర్యకు విలన్ గా దేవిపుత్రుడు లో మరియు దొంగాట వంటి సినిమాల్లో కలిసి నటించారు.ఎన్నో ఏళ్ళ తర్వాత కలిసిన కూడా చిన్న పిల్లలలాగానే మొదటి సినిమా కోసం కష్టపడ్డట్టుగానే కష్టపడేది అంటూ సురేష్ తెలిపారు.

అమ్మోరు సినిమా ద్వారా సౌందర్య తో కలిసి నటించడం తనకు దక్కిన అదృష్టం అని తెలిపారు.

Telugu Suresh, Ammoru, Rami Reddy, Ramya Krishna, Soundarya, Tollywood-Movie

ఇక ఈ సినిమాలోని స్పెషన్ ఎఫెక్ట్స్ అప్పట్లో అందరికి షాక్ కి గురి చేశాయి.ఈ సినిమా ద్వారా సురేష్>( Suresh ) దేవుడిని కూడా నమ్మడం మొదలు పెట్టారట.అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మోరు చిత్రం తనకు దేవుడిని పరిచయం చేసింది అంటారు సురేష్.

ఇక మరొక ముఖ్యమైన సంఘటన అతడి ఆరోగ్యం అప్పటికి చాల పాడైంది.కానీ ఈ సినిమా తర్వాహ ఆ దేవుడి మహిమ కాబోలు తన ఆరోగ్యం కూడా సెట్ అయ్యిందని సురేష్ తెలిపారు.

ఇక ఈ సినిమా ద్వారా సౌందర్యం( Soundarya )తో మంచి స్నేహం కూడా ఏర్పడింది అట.కానీ దేవుడు అన్యాయం సహసాడు అని, ఆమెను త్వరగా తీసుకెళ్ళిపోయి, తీరని అన్యాయం చేసాడు అంటూ చెప్పుకోచ్చారు.

Telugu Suresh, Ammoru, Rami Reddy, Ramya Krishna, Soundarya, Tollywood-Movie

ఇవి మాత్రమే కాకుండా చివరగా ఒక సూపర్ హిట్ సినిమాలో నటించే అవకాశం కూడా దక్కింది అంటూ అమ్మోరు సినిమా గొప్పతనం గురించి సురేష్ ఓపెన్ అయ్యారు.ఈ సినిమా అప్పట్లో సాధించిన విజయం మాములుగా కాదు.ఊరూరా పల్లెపల్లెన ఈ సినిమా అందరిని ఎంతగానో అలరించింది.ఇక అమ్మోరు సినిమా లో దేవత పాత్రలో రమ్యకృష్ణ( Ramya Krishna ) నటించడం కూడా ఒక పెద్ద విషయమని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube