సాధారణంగా సినిమా సెలబ్రిటీల మధ్య కొద్దిగా మనస్పర్ధలు కారణంగా హీరోయిన్స్ లేదా హీరోలు మొహం పెడ మొహంగా ఉంటారు.ఇలా ఉన్నటువంటి వారు ఏదైనా ఒక కార్యక్రమంలో కనుక కలిస్తే ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు.
ఎదురుగా ఆ సెలబ్రిటీలు వస్తున్న పక్కకు తప్పుకునే వెళ్తూ ఉంటారు.అయితే తాజాగా ఇలా రష్మిక ( Rashmika ) బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ( Shraddha kapoor )మధ్య ఈ విధమైనటువంటి సన్నివేశమే చోటుచేసుకుంది.
వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రముఖ బిలీనియర్ ముకేష్ అంబానీ( Mukesh Ambani ) ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలలో భాగంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమానికి రష్మిక మందన్న ఎంతో చూడముచ్చటగా చీర కట్టుకొని సాంప్రదాయంగా ఈ వినాయక చవితి వేడుకలకు హాజరయ్యారు.అయితే ఈమె లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో తనకు ఎదురుగా బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ వచ్చారు.అయితే రష్మిక ఆమెను పలకరించినప్పటికీ శ్రద్ధా కపూర్ మాత్రం ఆమెను అవాయిడ్ చేస్తూ తల దించుకొని వెళ్ళిపోయారు.దీంతో రష్మిక కాస్త అవమానకరంగానే ఫీల్ అయింది.ఇలా ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శ్రద్ధ వ్యవహార శైలి పట్ల రష్మిక అభిమానులు కూడా మండిపడ్డారు.

ఈ విధంగా వినాయక చవితి వేడుకలలో రష్మికను అవాయిడ్ చేసినటువంటి శ్రద్ధ తాజాగా ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు.ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు ఇదే ఫోటోని రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోపై శ్రద్ధ కపూర్ స్పందిస్తూ వాట్ ఎ బ్యూటీ అంటూ ఈ ఫోటోపై ఈమె కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
దీంతో రష్మిక అభిమానులు మొన్న కనిపిస్తే మాట్లాడలేదు కానీ ఇప్పుడు పొగుడుతున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.మొన్న జరిగిన డ్యామేజ్ సరి చేసుకోవడం కోసమే శ్రద్ధా కపూర్ ఇలా రష్మికను పొగుడుతుందని తెలుస్తోంది.







