తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు వెంకటేష్.టాలీవుడ్ లో కుటుంబ కథ చిత్రాలకు చిరునామాగా మారారు వెంకటేష్.
( Venkatesh )ఒక వైపు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే, మరో వైపు కుటుంబ కథ చిత్రాలు చేస్తూ, తెలుగు ప్రేక్షకుల మనసులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.ఆయన తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో నటించినప్పటికీ, సౌందర్యం( Soundarya )తో ఆయన చేసిన సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.
వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, ఎవర్గ్రీన్ చిత్రాలుగా తెలుగు ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయాయి.ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా, ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్లిద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉండేది.

అందుకే ఒకానొక సంయమలో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే పుకార్లు కూడా వచ్చాయి.అదే సమయంలో వెంకటేష్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం, అతను సౌందర్యను పెళ్లి చేసుకుంటాడని ఫిక్స్ అయిపోయారు అందరు.ఐతే జనాల ఊహలలో నిజం లేకపోలేదు.వెంకటేష్ సౌందర్యను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తో తన తండ్రి రామా నాయుడు కి ఈ విషయం చెప్పాడట.రామా నాయుడు గారు వద్దని ఎంత చెప్పిన వినిపించుకోలేదట.దాంతో రామానాయుడు గారు డైరెక్ట్ గా సౌందర్య దగ్గరకు వెళ్లి, తనకు ఒక ఫామిలీ ఉందని, వాటిని డిస్టర్బ్ చెయ్యొద్దని అడిగారట.

ఆయన మీద గౌరవం తో సౌందర్య అప్పటినుంచి వెంకటేష్ కు దూరంగా ఉండడం ప్రారంభించారట.ఐతే అప్పటికే వారి ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి ఉన్న పుకార్లను చెరిపేయడానికి, రామానాయుడు గారు సౌందర్య తో వెంకటేష్ కు రాఖీ కట్టించారట.ఈ విషయం అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది.వెంకటేష్, సౌందర్య కాంబోలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ( Intlo Illalu Vantintlo Priyuralu )పెళ్లిచేసుకుందాం రా, పవిత్ర బంధం, రాజా, జయం మనదేరా( Jayam Manadera ) వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
వీరిద్దరి కాంబోలో వచ్చిన చివరి చిత్రం దేవి పుత్రుడు.ఈ సినిమా విడుదలైన కొద్దీ సంవత్సరాలకే, సౌందర్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.ఆ తరువాత దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.







