పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ramcharan Tej ) నటిస్తున్నటువంటి తాజా చిత్రం గేమ్ చేంజర్( Game Changer ) .శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇక ఈ సినిమా కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో మెగా అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు అంతే కాకుండా ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్ లేకపోవడంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.తాజాగా డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ నటిస్తున్నటువంటి ఇండియన్ 2 ( Indian 2 )సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో తదుపరి ఈ సినిమాపై ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తోంది.

సెప్టెంబర్ నెలలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్స్ సన్నివేషాన్ని చిత్రీకరించబోతున్నారని వెల్లడించారు.అయితే ఆర్టిస్టుల డేట్స్ ఖాళీగా లేకపోవడంతోనే ఈ షెడ్యూల్ షూటింగ్ కాస్త క్యాన్సిల్ అయింది తాజాగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు( Dil Raju )చేసినటువంటి ట్వీట్ మెగా అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేసింది అయితే దిల్ రాజు ఆర్టిస్టుల డేట్స్ ఖాళీగా లేవని చెప్పినప్పటికీ నిజం మాత్రం మరొకటి ఉందని వెల్లడిస్తున్నారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ సన్నిహితులు ఈ విషయంపై స్పందిస్తూ రామ్ చరణ్ చేతికి గాయం కావడం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది అని తెలుస్తుంది.

ఇలా రామ్ చరణ్ చేతికి అయినటువంటి గాయం( Ram Charan Injured ) మేకప్ వేసి కవర్ చేయడానికి కూడా వీలు కాలేదట దీంతో డాక్టర్లు కూడా పది రోజులపాటు అయినా విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ఈ షెడ్యూల్ చిత్రీకరణ అక్టోబర్ రెండోవారానికి వాయిదా వేశారు అంటూ రాంచరణ్ సన్నిహితులు తెలియజేస్తున్నారు.ఇలా రాంచరణ్ చేతికి గాయం అయింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో( Social Media ) ప్రచారం కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అసలు చరణ్ చేతికి ఏమైంది అంటూ అభిమానులు కంగారు పడటమే కాకుండా ఈయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.







