గోల్డ్ మెంబర్‌షిప్‌ను జొమాటోలో ఉచితంగా పొందేదెలా..

జొమాటో గోల్డ్( Zomato Gold ) అనేది డైనింగ్, ఫుడ్ డెలివరీపై ప్రత్యేకమైన డిస్కౌంట్‌లు, ప్రయోజనాలను అందించే మెంబర్‌షిప్ ప్రోగ్రామ్.ఇది ప్రస్తుతం భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా దేశాల్లో అందుబాటులో ఉంది.

 How To Get Zomato Gold Membership For Free,zomato, Food Delivery App,gold Member-TeluguStop.com

జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ పొందడానికి మొదటగా జొమాటో వెబ్‌సైట్ లేదా యాప్‌ని విజిట్ చేసి, “జొమాటో గోల్డ్” ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

Telugu Delivery App, Gold Membership, Zomato, Zomato Offers-Latest News - Telugu

కావలసిన మెంబర్‌షిప్ ప్లాన్‌( Zomato Gold Membership Plan )ను ఎంచుకుని, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి, పేమెంట్ చేయాలి.పేమెంట్ ప్రాసెస్ పూర్తి అయ్యాక, యాక్టివేషన్ కోడ్‌ని అందుకుంటారు.జొమాటో యాప్‌ని తెరిచి, “ప్రొఫైల్” ట్యాబ్‌కి వెళ్లాలి.“జొమాటో గోల్డ్”పై క్లిక్ చేసి, యాక్టివేషన్ కోడ్‌ను ఎంటర్ చేయాలి.అంతే, జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతుంది.
జొమాటో గోల్డ్ ప్రస్తుతం ఇన్విటేషన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది.జొమాటో వెబ్‌సైట్ లేదా యాప్( Zomato App ) నుండి నేరుగా మెంబర్‌షిప్‌ను కొనుగోలు చేయలేకపోతే, ఇప్పటికే సభ్యులుగా ఉన్న స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఇన్విటేషన్ కోడ్‌ని పొందడానికి ప్రయత్నించవచ్చు.గోల్డ్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందడానికి జొమాటో యాప్‌ని ఓపెన్ చేసి “ప్రొఫైల్ పిక్చర్”పై నొక్కి “కూపన్స్” కేటగిరి కింద “కలెక్టెడ్ కూపన్స్” పై నొక్కాలి.“అమౌంట్ ఆఫ్ కూపన్స్” కనిపించాక వాటితో ఉచితంగా గోల్డ్ మెంబర్‌షిప్‌ను పొందవచ్చు.హిడెన్ కూపన్స్‌ను కూడా ఫ్రీ మెంబర్‌షిప్‌ కోసం వినియోగించొచ్చు.

Telugu Delivery App, Gold Membership, Zomato, Zomato Offers-Latest News - Telugu

జొమాటో తరచుగా ఫ్రీ లేదా డిస్కౌంటెడ్ గోల్డ్ సభ్యత్వాన్ని అందించే ప్రోమో కోడ్‌లను విడుదల చేస్తుంది.ఈ ప్రోమో కోడ్‌లను జొమాటో వెబ్‌సైట్ లేదా యాప్‌లో అలాగే భాగస్వామి వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా పేజీలలో కనుగొనవచ్చు.ప్రోమో కోడ్‌ను రీడీమ్ చేయడానికి, జొమాటో యాప్‌ని తెరిచి, గోల్డ్ విభాగానికి వెళ్లండి.

“ఐ హావ్ యాక్టివేషన్ కోడ్”పై నొక్కి, కోడ్‌ను నమోదు చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube