కవితను ఈ రోజే అరెస్ట్ చేస్తున్నారా ?

తెలంగాణ సీఎం కేసీఆర్( CM kcr ) కుమార్తె,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha ) వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను అరెస్ట్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.

 Is Kavitha Being Arrested Today , Telangana Cm Kcr , Brs Party , Telangana-TeluguStop.com

ఈరోజు లేదా రేపు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే అనేకసార్లు ఈడి అధికారుల విచారణకు కవిత హాజరయ్యారు.

ఈ కేసుతో తనకు సంబంధం లేదని,  కేవలం రాజకీయ కక్షతోనే కేంద్ర బిజెపి ( BJP )పెద్దలు ఈ కేసులో తనను ఇరికిస్తున్నారని కవిత చెబుతున్నారు.ఇక ఈడి విచారణ కు కూడా వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని , వర్చువల్ గా విచారించాలంటూ కవిత వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈనెల 26న విచారించనుంది .ఈ విచారణ పూర్తయిన తర్వాత కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Telugu Brs, Magunta Raghuva, Pcc Cheif, Telangana-Politics

 ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో అనేక మంది పేర్లు వినిపించాయి.ఎంతోమంది అరెస్ట్ అయ్యారు .సౌత్ లాబీలో కవిత తరఫున లావాదేవీలు నిర్వహించిన వారంతా అప్రూవర్లు గా మారారు .వీరు చెప్పిన వివరాలు, డాక్యుమెంట్లతో కవితను( Kavitha ) అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది .ఇప్పటికే ఈ కేసులో ప్రమేయం ఉన్న వారంతా దాదాపుగా అరెస్టు అయ్యారు.ముఖ్యంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) పేరు కూడా ఈ స్కాంలో ప్రముఖంగా వినిపిస్తోంది.” కల్వకుంట్ల కవితతో నన్ను మాట్లాడమని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.లేదా ఆమె నాతో మాట్లాడుతారని చెప్పారు.మీరు ఇద్దరు కలిసి పని చేయవచ్చన్నారు.అన్ని వివరాలు కవిత చూసుకుంటారు.ఆమె తన టీం తో కలిసి మద్యం విధానం గురించి పనిచేస్తున్నారు.

Telugu Brs, Magunta Raghuva, Pcc Cheif, Telangana-Politics

కవిత( Kavitha ) టీం తో విజయ్ నాయర్ కలిసి పనిచేస్తున్నారు.” అంటూ ఒంగోలు వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ఈడి అధికారులకు తెలిపారు.ఇటీవల అప్రూవర్ గా మారిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి 100 కోట్ల ముడుపుల్లో తమ వాటా కింద 25 కోట్లను తన కుమారుడు రాఘవ  , బుచ్చిబాబు,  అభిషేక్ బోయిన్ పల్లి కి చెల్లించారని తెలిపారు.ఇప్పటికే కవిత అరెస్టుకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కవితను రెండు రోజుల్లో అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని  రేవంత్ రెడ్డి సైతం వ్యాఖ్యానించారు.ఇప్పుడు కవిత అరెస్టుకు సంబంధించిన వ్యవహారంపైనే తెలంగాణ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube