కాకరకాయ( Bitter Gourd ).చాలా మందికి అస్సలు ఇష్టం లేని కూరగాయల్లో ఇది ఒకటి.
కాకరకాయ చేదుగా ఉండడమే ఇందుకు కారణం.మీరు కూడా కాకరకాయను దూరం పెడుతున్నారా.? అయితే బోలెడు ఆరోగ్య లాభాలు మీరు చేతులారా వదులుకున్నట్లే అవుతుంది.చేదుగా ఉన్నా కూడా కాకరకాయలో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ సి.ఇలా ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.ముఖ్యంగా కాకరకాయను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే లెక్కలేనన్ని లాభాలు పొందుతారు.

అందుకోసం ముందుగా ఒక కాకరకాయను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ కాకరకాయ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి సేవించాలి.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ కాకరకాయ జ్యూస్( Bitter Gourd Juice ) ను తీసుకోవాలి.
వారానికి కేవలం రెండుసార్లు ఈ కాకరకాయ జ్యూస్ ను తీసుకుంటే బోలెడు లాభాలు పొందుతారు.ముఖ్యంగా కాలేయానికి కాకరకాయ అండగా ఉంటుంది.దెబ్బ తిన్న కాలేయాన్ని రిపేర్ చేయడానికి కాకరకాయలో ఉండే పోషకాలు అద్భుతంగా తోడ్పడతాయి.ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు కాకరకాయ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడతారు.

అలాగే వారానికి రెండు సార్లు కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ( Immunity Booster ) బలపడుతుంది.బరువు తగ్గాలనుకునే వారికి కాకరకాయ జ్యూస్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.కాకరకాయలో కేలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.కాకరకాయ జ్యూస్ తాగితే మెటబాలిజం రేటు ఇంప్రూవ్ అవుతుంది.దీంతో కేలరీలు త్వరగా కరుగుతాయి.ఫలితంగా వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు .అంతేకాదు కాకరకాయ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది.మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.
ఆల్రెడీ మధుమేహం ఉంటే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు తప్పకుండా ఉంటాయి.కాకరకాయ జ్యూస్ తాగితే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
మరియు తెల్ల జుట్టు త్వరగా రాకుండా సైతం ఉంటుంది.