తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకోవడానికి ఇండస్ట్రీలో చాలా రకాల సినిమాలు చూస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ఉంటారు.అయితే ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన రాజీవ్ కనకాల ( Rajeev Kanakala )గురించి మనందరికీ తెలిసిందే.
ఆయన ఈ మధ్య సినిమాల్లో ఉన్నప్పటికీ ఏదో కారణంగా సినిమాలో క్యారెక్టర్ ని చంపేసి ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాకుండా మధ్యలోనే ముగిసిపోయేటట్టుగా డైరెక్టర్లు చేస్తున్నారు.ముఖ్యంగా ఆయనకి అవే క్యారెక్టర్లు రావడం అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా సినిమాల్లో చూసాం.
అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఆయన ఇలాంటి క్యారెక్టర్లు పోషిస్తూ వస్తున్నాడు కానీ విరూపాక్ష సినిమాలో( Virupaksha ) మాత్రం ఆయన క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొనసాగుతోంది.ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా ఈయన నటించడం జరిగింది.
ఈ సినిమాలో ఒక ఫుల్ లేంత్ క్యారెక్టర్ చేయడం వల్ల కూడా ఆయనకి మంచి పేరే వచ్చింది.అయితే రాజీవ్ కనకాల ఒకప్పుడు హీరో అవుదామని ఇండస్ట్రీ కి వచ్చినప్పటికీ కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడు అయినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నాడు.ప్రస్తుతం ఆయన స్టార్ హీరోలందరితో నటించాడు.
ఇక ఎన్టీఆర్( NTR ) కి ఈయనకి మధ్య ఉన్న సంబంధం గురించి మనం చెప్పాల్సిన పనిలేదు వీళ్లిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్…ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ప్రతి సినిమా లో ఏదో ఒక క్యారెక్టర్ లో రాజీవ్ కనకాల చేసుకుంటూ వసస్తున్నాడు.ఒకవేళ రాజీవ్ కనకాల క్యారెక్టర్ సినిమాలో లేకపోయినా కూడా ఎన్టీయార్ డైరెక్టర్లతో చెప్పి ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ని రాజీవ్ కోసం క్రియేట్ చేయిస్తాడు అలాంటి మంచి ఫ్రెండ్స్ వీళ్లు అందుకే రాజీవ్ కనకాల ఎప్పుడు ఎన్టీఆర్ తో కనిపిస్తూ ఉంటాడు.రాజీవ్ కనకాల కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.