ప్రస్తుతం ఉన్న మనం ఉన్న ఈ జీవనశైలి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు.ఒకప్పుడు పల్లెటూర్లలో జీవిస్తూ ప్రతిరోజు ఒకరి ఇంటికి ఒకరు వెళుతూ ఇంట్లో ఏ సమస్య ఉన్న అందరిదీ ఆ సమస్య అన్న విధంగా నడుచుకుంటూ ఉండేవారు ఏదైనా శుభకార్యం జరిగినా లేదా అశుభ కార్యం జరిగిన ఆ మేమున్నామంటూ ముందుకు వచ్చేవారు కానీ సిటీ జీవితాలు అలా ఉండవు.
పక్కింట్లో ఏం జరిగిందో కూడా తెలిసే అవకాశం ఉండదు.ఇక అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఇంకా దారుణంగా తయారయ్యాయి అందరి జీవితాలు.
పై బ్లాక్ లో కింద బ్లాక్ లో ఉన్న వ్యక్తులకు సంబంధాలు ఉండే అవకాశం లేదు.పక్కింట్లో ఉన్న వారి పేరు కూడా తెలియదు.
అంత కాంక్రీట్ జంగల్ అయిపోయింది.
ఇదే విషయంపై తనికెళ్ల భరణి( Tanikella Bharani ) ఇటీవల రామ్ లక్ష్మణ్( Ram Laxman ) లతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలను తెలిపారు.ప్రస్తుతం అందరి జీవనశైలి దారుణంగా పాడైందని ఈ అపార్ట్మెంట్ కల్చర్ మనుషుల మధ్య సంబంధాలను తుంచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు భరణి.తనికెళ్ల భరణికి జేసుదాసు అంటే చాలా ఇష్టం కానీ ఆయన ఎప్పుడూ ఇండియాలో ఉండేవారు కాదు న్యూ జెర్సీలో( New Jersey ) ఉంటారని తెలిసి ఒకసారి అమెరికా వెళ్ళిన సందర్భంలో ఆయనను కలవడానికి జేసుదాసు ఇంటికి వెళ్లారు తనికెళ్ల భరణి.
అయితే తీరా అక్కడికి వెళ్ళాక జేసుదాసు గారు లేకపోగా ఇంటికి తాళం వేసి ఉండడంతో పక్కింటి వాళ్ళను వెళ్లి అడిగారట.
జేసుదాసు గారు ఈ పక్క ఇంట్లోనే ఉంటారు.వారి ఇంటికి తాళం ఉంది.ఆయన గురించి కానీ, నంబర్ కానినుందా అనినడగగానే ఆయన ఎవరో తెలియదండి.
ఆ ఇంట్లో నుంచి పాటలు పాడుతూ ఉంటారు ఆయనేనా అని చెప్పడంతో తనికెళ్ల భరణి షాక్ కి గురయ్యారట.ఇండియాలోనే పేరు మోసిన ఆ పాటగాడి గురించి పక్కింట్లో వాళ్లకి కూడా తెలియదంటే ఎంతటి దారుణము అంటూ తనికెళ్ల భరణి తన ఆవేదన మొత్తం చెప్పుకున్నారు.
ప్రగాఢంగా కనిపిస్తుందని ఈ పరిస్థితులు మనకు మంచివి కావు అంటూ చెబుతున్నారు.