భారత్-ఆస్ట్రేలియా( Australia ) మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.భారత జట్టులో కీలక ఆటగాళ్లు లేకపోయినా తొలి వన్డేలో జట్టు సమష్టిగా రాణించి ఆస్ట్రేలియాపై పై చేయి సాధించింది.
తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు పేసర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీయగా.కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు.
ఇక సూర్య కుమార్ యాదవ్ కూడా అర్థ సెంచరీ తో ఫామ్ లోకి వచ్చేసాడు.దీంతో వన్డేల్లో భారత్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.
అయితే ఇద్దరు ఆటగాళ్లు నేడు జరిగే రెండో వన్డే మ్యాచ్లో రాణిస్తేనే.వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కుతుంది లేకపోతే అంతే సంగతులు.
ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
శ్రేయస్ అయ్యర్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత ఓపెనర్లు శుబ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ మంచి శుభారంభం అందించిన.శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేక ఘోరంగా విఫలమయ్యాడు.మరొకవైపు ఫీల్డింగ్ లోను క్యాచ్ లను జారవిడిచాడు.నేడు జరిగే మ్యాచ్ లో సమర్థవంతంగా రాణించక పోతే వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు దక్కడం కష్టమే.
శార్థూల్ ఠాకూర్
: తోలి వన్డేలో వికెట్లు తీయకుండా ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.జట్టుకు ఆల్ రౌండర్ గా తన వంతు కృషి చేస్తాడు అనుకుంటే.పేలవ ఆటను ప్రదర్శిస్తున్నాడు.
నేడు జరిగే మ్యాచ్లో తనను తాను నిరూపించుకోకపోతే వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు కష్టమే.
ఇక రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ) చాలా కాలం తర్వాత వన్డే జట్టులోకి వచ్చి.10 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకుని కీలకమైన లబుషేన్ వికెట్ తీశాడు.అక్షర పటేల్ లేని లోటును పూర్తిగా తీర్చేశాడు.
అక్షర్ పటేల్ గాయం నుంచి కోల్పోకపోతే అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు దక్కుతుంది.కానీ నేడు జరిగే మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ కూడా సమర్థవంతంగా రాణిస్తేనే చోటు పదిలంగా ఉంటుంది.