యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండల కేంద్రం నుండి చీకటిమామిడి వెళ్ళే మార్గంలో ఖాజీపేట వాగుపై గల పురాతన కల్వర్టును దాటాలంటే వాహనదారుల,ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.ఆ కల్వర్టుకు ఇరువైపుల రక్షణగోడ లేకపోవడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఏ మాత్రం అటు ఇటు అయినా బ్రిడ్జి మీద నుండి ఉదృతంతగా ప్రవహించే వాగులో పడిపోవడమేనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రక్షణ గోడ లేని బ్రిడ్జి మీద నుండి వెళుతుంటే కింద ప్రవహిస్తున్న నీళ్లను భయమేస్తుందని,ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నామని వాహనదారులు వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కల్వర్టుకు రెండు పక్కలా రక్షణ గోడ నిర్మాణం చేపట్టి ప్రమాదం జరగకుండా చూడాలని ప్రయాణీకులు,వాహనదారులు కోరుతున్నారు.







