బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ”యానిమల్”( Animal Movie ) ఒకటి.ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ ఫ్యాన్స్ లో చాలా మంది ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తెరకెక్కించడం వల్ల టాలీవుడ్ లో కూడా ఈ సినిమా అలరిస్తుంది.
‘యానిమల్’ సినిమాలో హీరోగా రణబీర్ కపూర్( Ranbir Kapoor ) నటిస్తుండగా హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే రణబీర్ కపూర్ రోల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది.ఇక ఇప్పుడు రష్మిక మందన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.అమ్మడి ఫస్ట్ లుక్ ఆమె ఫ్యాన్స్ ను ఫిదా చేసేస్తుంది.సింపుల్ అండ్ హోమ్లీ లుక్ లో ఆకట్టు కుంటుంది.

యానిమల్ సినిమాలో అమ్మడికి ఇంపార్టెన్స్ రోల్ దక్కిందో లేదో తెలియదు కానీ ఈ సినిమాతో రష్మిక అక్కడ మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయం.ఈ సినిమాలో ఈమె ఫస్ట్ లుక్ చీర కట్టుకుని తెలుగుదనం ఉట్టిపడేలా చాలా ఆకర్షణీయంగా ఉండడంతో అమ్మడి లుక్ కొద్దీ క్షణాల్లోనే వైరల్ అయ్యింది.ఈ లుక్ ను ఆమె ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక యానిమల్ సినిమాపై ఇప్పటికే బాలీవుడ్ లో( Bollywood ) మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇక ఒక్కొక్కటిగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ మరింత హైప్ పెంచేస్తున్నారు.ఇక ఈ సినిమాకు హర్ష వర్షన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది.







