బాబు అవినీతిని అసెంబ్లీలో ప్రదర్శిస్తామంటున్న వైసీపీ ?

చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తర్వాత అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం కనిపిస్తుంది .దీంతో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు అందరూ ఊహించినట్టే చాలా హాట్ హాట్ గా జరిగాయి ఇరు పార్టీల దాదాపు బాహా బాహి తలపడ్డాయి .

 Ycp Wants To Show Babu's Corruption In The Assembly, One Nation One Election ,-TeluguStop.com

ఉద్రిక్త వాతావరణం ఏర్పడటం , అసెంబ్లీ మార్షల్స్ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో మొదటి రోజు సమావేశాలు వాయిదా పడ్డాయి .ఇక మిగిలిన సమావేశాలను తెలుగుదేశం పార్టీ బాయ్ కాట్ చేసే వాతావరణం కనిపిస్తుంది.అయితే సమావేశాలను పూర్తిస్థాయిలో నిర్వహించి తీరాలని అదికార పక్షం నిర్ణయించింది .

Telugu Amaravtai, Assembly, Chandrababu, Fiber Grid-Telugu Political News

`రోజుకొక అంశాన్ని తీసుకుని చంద్రబాబును అరెస్టు చేయాల్సిన పరిస్థితులను, బాబు హయాంలో జరిగిన అవినీతిని, రోజుకొక అంశాన్ని ఎన్నుకొని కూలంకషంగా అసెంబ్లీలో చర్చకు పెడదామని బాబు అవినీతి వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు లెక్కలతో సహా వివరిద్దామని వైసిపి అధినాయకత్వం( YCP ) ఎమ్మెల్యేలకు సూచించినట్లుగా తెలుస్తుంది .ఒకరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కాం వెనకఅవినీతిని , మరో రోజు అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ లో జరిగిన అవినీతిని మరొక రోజు ఫైబర్ గ్రిడ్( Fiber Grid ) కేటాయింపులలో జరిగిన అవినీతిని ఇలా బాబును అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులను ప్రజలకు వివరిస్తారట.

Telugu Amaravtai, Assembly, Chandrababu, Fiber Grid-Telugu Political News

తన సామాజిక వర్గ నేతలకు, తమ పార్టీ నాయకులకు మాత్రమే అమరావతిలో భూముల కేటాయింపులలో ప్రయోజనం కలిగేలా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తమ అనునయులకు ప్రయోజనం కలిగేలా ఎలాంటి కేటాయింపులు చేసిందో వైసిపి ప్రభుత్వ పెద్దలు కూలంకషంగా అసెంబ్లీలో ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది .ఈ వివరణ తర్వాత చంద్రబాబు అరెస్టును రాష్ట్ర ప్రజలు చూసే పద్ధతి మారుతుందని, చంద్రబాబుకు తగిన శిక్ష పడిందని మెజారిటీ ప్రజలు భావిస్తారని వైసీపీ అధినాయకత్వం బావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి అధికారపక్ష వ్యూహాలకు ప్రతిపక్షం ఎలాంటి ఎత్తులను సిద్ధం చేస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube