తెలుగు తమ్ముళ్లకు గుబులు పుట్టిస్తున్న శుక్రవారం

చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు తెలుగు తమ్ముళ్లలో హడలు పుట్టిస్తున్నట్లుగా తెలుస్తుంది .ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, చంద్రబాబు రెండు రోజుల్లో బేయిల్ పై బయట వచ్చేస్తారని చాలామంది ఊహించారు .

 This Is Friday Is Key Day For Tdp , Chandrababu Arrest , Acb Court, Cid , High-TeluguStop.com

అయితే జరుగుతున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీకి అంతా సులువుగా మింగుడు పడటం లేదు.ప్రభుత్వం పూర్తిస్థాయిలో లీగల్ గా సిద్ధం కావడంతో జాతీయస్థాయి లాయర్లను తీసుకువచ్చి ఈ కేసులో మోహరించినా తెలుగుదేశానికి ఇంతవరకూ ఊరట దక్కలేదు.

మధ్యంతర బైయిల్ కోసం ఒక పిటిషన్, రిమాండ్ ను క్యాన్సిల్ చేయాలనే క్వాష్ పిటిషన్, మరోవైపు ఇవి కాక చంద్రబాబును సిఐడి విచారణకు అప్పజెప్పాలని ఏసీబీ కోర్టులో సిఐడి వేసిన మరో కేసు ఇలా అనేక వ్యూహ ప్రతివ్యూహలు చంద్రబాబు అరెస్టు విషయంలో జరుగుతున్నాయి.ఈరోజు చంద్రబాబు కస్టడీ విషయంలో ఏసీబీ కోర్ట్ లో తీర్పు వస్తుందని చాలామంది ఆశించారు .

Telugu Acb, Ap, Chandrababu, Cm Jagan-Telugu Political News

క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో రేపు తీర్పు వచ్చే అవకాశం ఉండడంతో సిబిఐ కోర్టు న్యాయమూర్తి ఈ కేసును వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది.రేపు హైకోర్టు( High Court )లో వచ్చే తీర్పును అనుసరించి రిమాండ్ కి ఇవ్వాలా వద్ద అన్నది తేలే అవకాశం కనిపిస్తుంది.అయితే ప్రాథమిక సాక్షాదారాలు బలం గా ఉన్నాయని సిఐడి చెబుతూ ఉండడంతో రిమాండ్ ను హైకోర్టు క్వాష్ చేస్తుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.ఒకవేళ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేస్తే మాత్రం తెలుగుదేశానికి భారీ ఎదురు దెబ్బగానే భావించవచ్చు .

Telugu Acb, Ap, Chandrababu, Cm Jagan-Telugu Political News

దాంతో ఆయనను సిఐడి విచారణకు కస్టడీకి అనుమతించే అవకాశాలు ఎక్కువ.అయితే రాజకీయ దురుద్దేశాలే తప్ప కనీస సాక్షాదారాలు ఇప్పటి వరకు ప్రభుత్వ లాయర్లు సమర్పించలేదని టిడిపి అనుకూల మీడియా లో వస్తున్న వార్తలను లెక్కలోకి తీసుకుంటే మాత్రం కోర్టు రిమాండ్ ను క్యాన్సిల్ చేయవచ్చు.అయితే అందుకు అవకాశాలు తక్కువే ఉన్నాయన్నది ప్రస్తుతానికి వినిపిస్తున్న సమాచారం.దాంతో ఈ రోజుని తెలుగుదేశం పార్టీ( TDP ) భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన రోజుగా చూడవచ్చు.

తమ అధినేతకు తీర్పు అనుకూలంగా రావాలంటూ తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే నూటొక్క దేవుళ్లకు మొక్కుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube