రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఇకపై 25 నగరాల్లో బైక్ రెంట్‌కు తీసుకోవచ్చు...!

రాయల్ ఎన్‌ఫీల్డ్( Royal Enfield ) లవర్స్‌కి కిక్కిచ్చే న్యూస్ చెప్పింది ఆ కంపెనీ.తాజాగా ఈ బైక్ తయారీదారు భారతదేశంలో “రాయల్ ఎన్‌ఫీల్డ్ రెంటల్స్”( Royal Enfield Rental ) పేరుతో కొత్త మోటార్ సైకిల్ రెంటల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

 Now Rent A Royal Enfield Motorcycle Across 25 Cities In India Details, Royal Enf-TeluguStop.com

ఈ ప్రోగ్రామ్‌ భారతదేశంలోని 25 నగరాల్లో 40కి పైగా మోటార్‌సైకిల్ రెంటల్ ఆపరేటర్‌ల సహకారంతో ప్రజలకు మోటార్‌సైకిల్స్‌ను అద్దెకు అందిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ రెంటల్స్‌లో 300 కంటే ఎక్కువ మోటార్‌సైకిళ్లు అద్దెకు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రోగ్రామ్ విశాఖపట్నం,( Vishakapatnam ) హైదరాబాద్,( Hyderabad ) అహ్మదాబాద్, ముంబై, గుజరాత్, మహారాష్ట్ర, చండీగఢ్, ధర్మశాల, లేహ్, మనాలి, హరిద్వార్, రిషికేశ్, ఉదయపూర్, జైపూర్, జైసల్మేర్, గోవా, కొచ్చి, భువనేశ్వర్, తిరువనంతపురం, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, సిమ్లా, నైనిటాల్, బిర్ బిల్లింగ్, సిలిగురి, డెహ్రాడూన్ వంటి నగరాల్లో అందుబాటులో ఉంటుంది.భవిష్యత్తులో మరిన్ని నగరాలను ఈ జాబితాలో చేర్చాలని కంపెనీ యోచిస్తోంది.

Telugu Motorcycles, Delhi, Explore, Hyderabad, India, Motorcycle, Royal Enfield,

అద్దెకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుంటే.మోటార్‌సైకిల్‌ను అద్దెకు తీసుకోవాలనుకునేవారు మొదటగా రాయల్ ఎన్‌ఫీల్డ్ రెంటల్స్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.మోటార్‌సైకిల్ అవసరమైన నగరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.పికప్, డ్రాప్-ఆఫ్ తేదీలు, సమయాలను ఎంచుకోవాలి.వెబ్‌సైట్ మీకు అందుబాటులో ఉన్న మోడల్‌లు, వాటి ధరలను చూపుతుంది.

Telugu Motorcycles, Delhi, Explore, Hyderabad, India, Motorcycle, Royal Enfield,

ఫారమ్‌ను పూరించడం ద్వారా ఆపరేటర్ వివరాలను పొందవచ్చు.ఆపరేటర్ ద్వారా రీఫండబుల్ ఛార్జ్( Refundable Charge ) ఉండవచ్చని గుర్తుంచుకోండి.ఈ రెంటల్ ప్రోగ్రామ్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది భారతదేశంలో మోటార్‌సైకిల్‌ను అద్దెకు తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.

దేశాన్ని అన్వేషించాలనుకునే పర్యాటకులు, రైడర్‌లకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube