ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.సభా సంప్రదాయాలను టీడీపీ సభ్యులు ఉల్లంఘించారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు.టీడీపీ సభ్యులు పయ్యావుల, సత్యప్రసాద్, కోటంరెడ్డిని సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.
అనంతరం స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టి కాగితాలు చింపివేసిన నేపథ్యంలో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సమావేశాల నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు.అనంతరం అసెంబ్లీని మరోసారి వాయిదా వేసినట్లు ప్రకటించారు.