ఈ ఇద్దరు హీరోయిన్లను దరిద్రం వెంటాడుతోందా.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ లలో ఛాన్స్ మిస్ అయ్యారా?

సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లకు బ్యాగ్రౌండ్ ఉండదు.అందం, అభినయం, సక్సెస్ రేట్ ద్వారా మాత్రమే హీరోయిన్లలో ఎక్కువమంది సక్సెస్ కావడం జరుగుతోంది.

 Pooja Hegde Keerthi Suresh Bad Luck Continues Details Here Goes Viral In Social-TeluguStop.com

అయితే టాలీవుడ్ కు చెందిన ఇద్దరు హీరోయిన్లను దరిద్రం వెంటాడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ హీరోయిన్లలో ఒక హీరోయిన్ కీర్తి సురేష్ కాగా మరో హీరోయిన్ పూజా హెగ్డే( Pooja hegde ) కావడం గమనార్హం.

దసరా సినిమాతో కీర్తి సురేష్ భారీ సక్సెస్ ను సొంతం చేసుకోగా ఈ సినిమాకు ముందు కీర్తి సురేష్ నటించిన సినిమాలేవీ ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు.దసరా సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ బిజీ అవుతారని అందరూ భావించగా ఎవరూ ఊహించని విధంగా భోళా శంకర్ సినిమాతో కీర్తి సురేష్ ఖాతాలో డిజాస్టర్ చేరింది.

ఈ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.

Telugu Keerthi Suresh, Naga Chaitanya, Pooja Hegde, Ravi Teja, Sai Pallavi-Movie

కీర్తి సురేష్ కు ఈ సినిమా తర్వాత కొత్త ఆఫర్లు రావడం లేదు.వాస్తవానికి చైతన్య చందూ మొండేటి కాంబో మూవీలో మొదట కీర్తి సురేష్ పేరును పరిశీలించారట.అయితే చైతన్య సాయిపల్లవి( Sai Pallavi ) కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు పడ్డాయి.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

Telugu Keerthi Suresh, Naga Chaitanya, Pooja Hegde, Ravi Teja, Sai Pallavi-Movie

మరో హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఇలాంటి బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ ( Gopichand Malineni )మూవీకి మొదట పూజా హెగ్డే పేరును పరిశీలించారట.అయితే చివరకు ఈ సినిమాలో రష్మిక ఫైనల్ అయ్యారు.

ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో చరిత్ర సృష్టిస్తాయో చూడాల్సి ఉంది.

ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube