టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన సతీమణి నారా బ్రాహ్మణిని ముందు పెట్టి పార్టీని నడిపిస్తామని తెలిపారు.
ఢిల్లీలో పార్టీ నేతలు అందరూ సమావేశం అయిన సమయంలో ఈ అంశం చర్చకు వచ్చిందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.ఒకవేళ లోకేశ్ అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే బ్రాహ్మణితో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు.
అదేవిధంగా టీడీపీకి సంక్షోభాలు ఏమీ కొత్తకాదని, ఈ క్రమంలోనే ఎంతమందిపై కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.మరోవైపు అక్రమ అరెస్టులపై ఆందోళన చెందవద్దన్న లోకేశ్ అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారని సమాచారం.
ఈ క్రమంలోనే ఒకవేళ అవసరం అయితే తన బదులుగా బ్రాహ్మణి పాదయాత్ర చేసేలా టీడీపీ ప్రణాళికలో ఉందని తెలుస్తోంది.