రాజన్నBసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట గ్రామంలో సర్పంచ్ బిలవేని పర్శరాం, గౌడ సంఘం సభ్యులతో కలిసి బుధవారం ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.
పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ పొట్టి తాటి విత్తనాలను నాటినారు.ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్( Srinath Goud ) మాట్లాడుతూ ఈ పొట్టి తాటి విత్తనాలను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తన స్వంత ఖర్చులతో ప్రత్యేకంగా బీహార్ రాష్ట్రం నుండి తెప్పించారు అని అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 50 వేల తాటి మొక్కలను పంచడం జరిగిందని .ఈ తాటి చెట్లు ఐదు నుండి ఏడు సంవత్సరాల తక్కువ సమయంలోనే కల్లుని ఇస్తామని, ఈ చెట్లు ఎత్తు తక్కువగా ఐదు నుండి పది ఫీట్లు మాత్రమే పెరుగుతాయని, వీటి వల్ల గౌడ వృత్తి దారులు ప్రమాదాల నివారణకు ఇవి ఉపయోగపడుతుందని గౌడ కులస్తుల కోసం.ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ప్రభుత్వం గౌడ వృత్తి దారులకు ప్రమాద బీమా 5 లక్షలు ఇస్తుందని, 50 సంవత్సరాలు నిండిన గౌడ వృత్తి దారులకు ఆసరా పెన్షన్లు ఇస్తుందని అన్నారు.ఈ సందర్భంగా గౌడ కులస్తుల కోసం ప్రత్యేకంగా బీహార్ రాష్ట్రం నుండి పొట్టి తాటి చెట్లను తెప్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కు గౌడ కులస్తులు అందరి తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిలవేని పర్షరాం , ఉప సర్పంచ్ బత్తిని కావ్యశ్రీ స్వామి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తిని మల్లయ్య గౌడ్ , మాజీ వైస్ ఎం.పి.పి దొంతి మల్లయ్య ,వార్డు సభ్యులు బత్తిని ప్రశాంత్ , గౌడ సంఘం అధ్యక్షుడు నాగుల చంద్రయ్య గౌడ్ , ఉపాధ్యక్షుడు కోమిరే పర్షరాం , గౌడ సంఘం నాయకులు బత్తిని రామ గౌడ్ , ఉతకం ఆగయ్య, ఉత్కం రాజయ్య, ఉత్కం దుర్గయ్య, ఉత్కం అంజయ్య, బత్తిని రాజేశం , కత్తి స్వామి , మామిడి శ్రీనివాస్ , ఉత్కం శ్రీనివాస్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు
.