ఇటీవలే సౌత్ ఇండియన్ ఇంటెర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరిగాయి.దక్షిణాది సినీ పరిశ్రమలో సూపర్ హిట్ సినిమాలకు నటీనటులకు, టెక్నీషియన్స్ కు అవార్డులు అందిస్తుంటారు.
మరి ఈ ఏడాది 11వ ఫైమా అవార్డుల ( 11th FIMA Awards )ప్రధానం జరిగింది.ఈ అవార్డుల్లో ఈసారి టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలు అవార్డులను అందుకున్నారు.

అందులో అడవి శేష్( Adavi sesh ) ఒకరు.ఈయనకు మేజర్ మూవీలో అద్భుత నటనకు గాను క్రిటిక్స్ అవార్డు లభించింది.దీంతో అడవి శేష్ కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేసారు.ప్రస్తుతం అడవి శేష్ తన సినిమా షూటింగ్ కూడా దుబాయ్( Dubai ) లోనే జరుగుతుండగా అదే సమయంలో జరిగిన సైమా అవార్డుల్లో కూడా పాల్గొని తనదైన శైలిలో సందడి చేసారు.

ఇక ఈ అవార్డులు ముగిసిన తర్వాత ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు తన స్నేహితులతో కలిసి మంచి సమయాన్ని ఆస్వాదిస్తున్నట్టు అనిపిస్తుంది.ఈ క్రమంలోనే ఈయన ఇద్దరు హీరోయిన్లతో దిగిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, సలార్ భామ శృతి హాసన్(Srinidhi Shetty, Salar Bhama Shruti Haasan ) లతో కలిసి దిగిన పిక్ నెట్టింట బాగా వైరల్ అయ్యింది.ఈ పిక్ లో ముగ్గురు కూడా ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిపిస్తున్నారు.
ఈ పిక్ అందరిని ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉండగా వరుస హిట్స్ తో దూసుకు పోతున్న అడవి శేష్ ఇప్పుడు తన కెరీర్ లోనే మంచి హిట్ అందుకున్న గూఢచారి సీక్వెల్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా షూటింగ్ నే దుబాయ్ లో జరుగుతుంది.వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటెర్టైనమెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నారు.







