ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య ఘటన భారత్ , కెనడాల మధ్య చిచ్చు రాజేసిన సంగతి తెలిసిందే.దీని వెనుక భారత ఏజెంట్ల హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటనతో అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి.అలాగే రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి.
ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ అప్రమత్తమైంది.కెనడాలో ఇప్పటికే వున్న, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్న భారతీయులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది.
కెనడాలో వున్నవారు, ముఖ్యంగా భారతీయ విద్యార్ధులు అత్యంత అప్రమత్తంగా వుండాలని బుధవారం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.కెనడా ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన రివైజ్డ్ ట్రావెల్ అడ్వైజరీకి ప్రతీకారంగా ఇండియా ఈ అలర్ట్ జారీ చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు.

భారత దౌత్యవేత్తలు( Indian diplomats ), భారత వ్యతిరేక ఎజెండాను వ్యతిరేకించే వారిని కొన్ని గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయని అలర్ట్‌లో కేంద్రం చెప్పింది.అందుచేత ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రాంతాలకు, వేదికలకు దూరంగా వుండాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది.కెనడాలోని భారతీయ సమాజం భద్రత, శ్రేయస్సు కోసం మన హైకమీషన్.కెనడియన్ అధికారులతో( Canadian authorities ) నిరంతరాయంగా చర్చలు జరుపుతుందని తెలిపింది.కెనడాలో క్షీణిస్తున్న పరిస్ధితుల దృష్ట్యా.భారతీయ విద్యార్ధులు అప్రమత్తంగా వుండాలని విదేశాంగ శాఖ బుధవారం పేర్కొంది.
కెనడాలోని భారతీయ పౌరులు , విద్యార్ధులు ఒట్టావాలోని భారత హైకమీషన్.టోరంటో, వాంకోవర్‌లలోని భారత కాన్సులేట్ కార్యాలయాలు.
సంబంధిత వెబ్‌సైట్లు, MADAD పోర్టల్ madad.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని కోరింది.

కాగా.ట్రూడో వ్యాఖ్యల నేపథ్యంలో హిందువులంతా తక్షణం కెనడాను వదిలిపెట్టాల్సిందిగా ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ‘‘ఎస్ఎఫ్‌జే’’( SFJ ) హెచ్చరించింది.నిజ్జర్ హత్యకు గాను భారతదేశానికి మద్ధతుగా హింసను ప్రోత్సహించినందుకు కెనడాను విడిచిపెట్టాల్సిందిగా అల్టీమేటం జారీ చేసింది.ఇక్కడున్న హిందువులు భారతదేశానికి మద్ధతు ఇవ్వడమే కాకుండా.ఖలిస్తాన్ మద్ధతుదారుల ప్రసంగాలు, వ్యక్తీకరణను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్ఎఫ్‌జే ఆరోపించింది.ఈ మేరకు ఆ సంస్థ కీలక నేత, న్యాయవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఓ వీడియోను విడుదల చేశారు.







