ఏఎన్ఆర్ మనవడిగా పుట్టడం నా అదృష్టం... చైతన్య ఎమోషనల్ కామెంట్స్?

అక్కినేని నాగేశ్వరరావు( ANR ) శతజయంతి వేడుకలలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోలో ఆయన విగ్రహవిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలెబ్రెటీలు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.

 Nagachaitanya Emotional Speech About Anr Full Details Here, Nagachaitanya, Anr-TeluguStop.com

ఇక ఈ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.ఇక కార్యక్రమంలో భాగంగా అక్కినేని కుటుంబ ( Akkineni Family ) సభ్యులందరూ కూడా పాల్గొని సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి సినీ సెలెబ్రెటీలందరూ పెద్ద ఎత్తున తరలి రావడంతో నాగచైతన్య( Nagachaitanya ) అఖిల్( Akhil ) వచ్చిన వారందరిని ఎంతో సాదరంగా ఆహ్వానించారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ తన తాతయ్య గురించి తన తాతయ్య గొప్పదనం గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.ఏఎన్ఆర్ అంటే ఇండస్ట్రీకి పెద్దగా గొప్ప నటుడిగా, క్లాసిక్ ఐకానిక్ గా సుపరిచయం.ఆయన చేసిన చిత్రాలు, కొత్త జానర్లలో చేసిన రిస్కులు ఎనలేనివి.

ఇప్పటికీ ఫిల్మ్ స్కూల్ ఏఎన్నార్ ను ఇన్పైరింగ్ కేస్ స్టడీగా  చదువుతూ ఉంటారు.అందులో నేను కూడా ఒకరీని అంటూ ఈయన తెలియజేశారు.

ఇక తాతయ్యతో కలిసి నటించిన మనం సినిమా( Manam movie ) నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని నాగచైతన్య వెల్లడించారు.నా లైఫ్ కెరీర్ టర్నింగ్ పాయింట్ మనం సినిమా అని నేను గర్వంగా చెప్పుకుంటాను అలా తాత గారితో కలిసి నటించే అదృష్టం రావడం నిజంగా గ్రేట్ అంటూ ఈయన తెలియజేశారు.ఇక మనం ఎప్పుడు ఎవరికీ ఎలా పుడతామో మన చేతుల్లో ఉండదు కానీ నేను మాత్రం ఏఎన్ఆర్ గారికి మనవడిగా పుట్టడం నా అదృష్టం అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య చేసినటువంటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube