టాలీవుడ్ హీరో నటుడు జగపతిబాబు( Jagapathi babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న జగపతిబాబు ప్రస్తుతం విలన్ క్యారెక్టర్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబుకి ఒక ఊహించని ప్రశ్న ఎదురయింది.
హీరోయిన్స్ తో ఎఫైర్ ప్రశ్నలను మీరు ఎందుకు వ్యతిరేకించరు? అలాంటి వార్తలు హీరోయిన్ ల కెరియర్ పై ప్రభావాన్ని చూపుతాయి కదా.

ముఖ్యంగా పెళ్లయిన హీరోయిన్లకు ఇబ్బంది కదా అని ప్రశ్నించగా.జగపతిబాబు స్పందిస్తూ.మా నాన్న మనకు వారసుడు లేరురా, అందరూ అమ్మాయిలే అన్నాడు.
వారసుడు లేకపోతే ఏమవుతుంది నాన్నా అన్నాను.ఉండాలి కదరా అన్నాడు.
మనం పోయాక ఏం జరుగుతుందో మనకి తెలియదు.అలాంటప్పుడు వారసుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటీ? అన్నాను.సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కానీ బయట ఎక్కడైనా ట్రై చేయనా అని సరదాగా అన్నాను.ఒక పూజారి నా దగ్గరకు వచ్చి ఫలానా హీరోయిన్ ఉంది సార్ మీరు కలవొచ్చు అన్నాడు.
అసలు ప్రపంచం ఇంత దారుణంగా ఉందా అనిపించింది.

ఇది అసలు అసంబద్ధం అనిపించింది అన్నారు జగపతి బాబు.ఈ క్రమంలో జగపతిబాబు సౌందర్యతో( Soundarya ) ఎఫైర్ రూమర్ తెరపైకి తెచ్చాడు.ఆ విషయంపై జగపతిబాబు మాట్లాడుతూ.
సితార పత్రికలో జగపతిబాబు సౌందర్యను వివాహం చేసుకోవడం లేదు అని హెడ్డింగ్ పెట్టి కథనం రాశారు.నేను షాక్ అయ్యాను.
అది రాసిన వాడిని అడిగాను.ఇవన్నీ కామన్ సర్ అన్నాడు.
వాడి పై వాడిని కలిసినా లాభం లేదు.అప్పుడు నేరుగా రామోజీ రావు దగ్గరకు వెళ్ళాను.
సర్ ఇలాంటి వార్తలు మీకు అవసరమా? నా విషయం తీసేయండి.నా ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంది.
ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మంచి మనిషి, టాలెంటెడ్ ఆర్టిస్ట్, ఆమెకు పెళ్లి అవుతుందా అని అడిగాను.నాకు తెలియదు బాబు అన్నాడు.
మీకు తెలియదు అంటే ఎలా మీరే ఎడిటర్ కదా అన్నాను.అప్పుడు రామోజీ దాని మీద చర్యలు తీసుకున్నాడు అని చెప్పుకొచ్చాడు జగపతిబాబు.
ఈ సందర్భంగా జగపతిబాబు చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారాయి.







