30 ఏళ్లకే ముడతలా.. వెల్లుల్లితో ఇలా చేస్తే దెబ్బకు మాయం అవుతాయి!

చర్మ సౌందర్యాన్ని దెబ్బ తీసే వాటిలో ముడతలు( wrinkles ) ఒకటి.ముడతలు ముసలితనానికి సంకేతం.

 Home Remedy For Removing Wrinkles On Face , Wrinkles, Wrinkles Removing Reme-TeluguStop.com

అందుకే ముఖంలో ముడతలు కనిపించగానే తెగ హైరానా పడిపోతుంటారు.పైగా ఇటీవల రోజుల్లో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తదితర కారణాల వల్ల 30 ఏళ్లకే ముడతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే వర్రీ వద్దు. వెల్లుల్లితో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే ముడతలు దెబ్బకు మాయం అవుతాయి.యవ్వనమైన చర్మం మీ సొంతం అవుతుంది.మరి ఇంతకీ వెల్లుల్లితో ముడతలకు ఎలా చెక్ పెట్టాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి పెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఐదు వెల్లుల్లి రెబ్బలు మరియు మూడు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి ఉడికించాలి.

పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Wrinkles, Wrinkles Remed

ఇప్పుడు మిక్సీ జార్ లో ఉడికించిన రైస్ ( Rice )మరియు వెల్లుల్లిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పల్చటి వస్త్రంలో వేసి స్మూత్ పేస్ట్ ను సపరేట్ చేసుకోవాలి.ఆపై ఈ స్మూత్ పేస్ట్ లో మూడు టేబుల్ స్పూన్లు క్యారెట్ జ్యూస్,( Carrot juice ) హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Wrinkles, Wrinkles Remed

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూతలా అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ముడతలు దెబ్బకు పరారవుతాయి.చర్మం టైట్ గా మారుతుంది.ఈ రెమెడీ వల్ల యవ్వనమైన ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.కాబట్టి ముడతలు సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube