సాధారణంగా ప్రతి ఒక్క గర్భిణీ( pregnant ) స్త్రీ కూడా గర్భధారణ సమయంలో తమ పిల్లలు అందంగా ఉండాలని తెల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.ఎలాంటి ఆహారం తీసుకుంటే తమ పిల్లలు తెలివైన పిల్లలుగా, అందమైన పిల్లలుగా పుడతారు అని వైద్యులను అడుగుతూ ఉంటారు.
అయితే తెలివైన పిల్లలను పొందడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు.కానీ అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు.
వీటిని తినడం వలన అందంగా, మేధావులుగా మారతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.గర్భిణీ స్త్రీల ఆహారంలో గుడ్లు( Eggs ) సరిపోతాయి.
గుడ్డు మన శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.
అంతేకాకుండా గర్భిణీలు దీన్ని తీసుకోవడం వలన పిల్లల మెదడు నేర్చుకునే సామర్థ్యం పై ప్రభావం చూపుతుంది.అయితే గర్భం దాల్చిన రెండో నెల నుండి గుడ్లు తీసుకోవడం వలన చాలా మంచి లాభాలు ఉంటాయి.ఎందుకంటే గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.
దీని వలన కడుపులో ఎదుగుతున్న పిండానికి చాలా ప్రోటీన్ అందుతుంది.అందుకే గర్భిణీ స్త్రీలు గుడ్లు తీసుకుంటే కడుపులోని పిండం సక్రమంగా అభివృద్ధి చెందుతుంది.
ఇక గుడ్డులో 12 విటమిన్లు కూడా ఉంటాయి.ఇందులో వివిధ రకాల లవణాలు ఉంటాయి.
కొలిన్ మరియు ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు, శిశువు( Baby ) యొక్క మొత్తం అభివృద్ధికి చాలా సహాయపడతాయి.దీనిని తీసుకోవడం వలన పిల్లల్లో మానసిక రుగ్మతలు కూడా రావు.ఇక గర్భిణీ స్త్రీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటే ఆ గర్భిణి స్త్రీ ప్రతి రోజు ఒక గుడ్డును తీసుకోవడం చాలా మంచిది.ఎందుకంటే ప్రతిరోజు ఒక గుడ్డు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ ( Cholesterol )స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
అయితే కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్న గర్భిణీ స్త్రీలు పసుపు భాగం తీసుకోకుండా తెల్లసోన మాత్రమే తినాలి.