స్టార్ హీరో ప్రభాస్( Star hero Prabhas ) మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కలలోనైనా చీమకు అపకారం చేయని హీరోగా ప్రభాస్ కు పేరుంది.
ఇండస్ట్రీలోని అందరు డైరెక్టర్లు ప్రభాస్ ను ఎంతగానో అభిమానిస్తారు.ప్రభాస్ తో ఒక్క సినిమా చేసినా చాలని చాలామంది డైరెక్టర్లు ఫీలవుతారు.
అయితే ప్రముఖ నటుడు జగపతిబాబు( Jagapathi Babu ) ప్రభాస్ గురించి కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.జగపతిబాబు చేసిన కామెంట్లు విని ప్రభాస్ కలియుగ కర్ణుడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సర్లార్ సినిమాలో జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం జగపతిబాబు ఐదు రోజుల డేట్స్ ఇచ్చారని జగపతి పాత్ర నిడివి పరిమితమైనా పవర్ ఫుల్ రోల్ అని సమాచారం అందుతోంది.ఎవరేం అడిగినా ప్రభాస్ ఇచ్చేస్తారని ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో ప్రభాస్ ముందుంటారని సమాచారం అందుతోంది.

స్టార్ హీరో ప్రభాస్ నాకు చాలా ఇష్టమైన మనిషి అని జగపతిబాబు చెబుతున్నారు.ప్రభాస్ కు కేవలం ఇవ్వడమే తెలుసు తప్ప అడగడం అస్సలు తెలియదని జగపతిబాబు కామెంట్లు చేశారు.ఎవరు ఎప్పుడు ఏం అడిగినా ప్రభాస్ ఇస్తాడని ఆయన తెలిపారు.
ఒకానొక సందర్భంలో నేను డిప్రెషన్ లో ఉన్నానని ప్రభాస్ కు కాల్ చేసి అదే విషయం చెప్పానని జగపతిబాబు తెలిపారు.ఆ సమయంలో ప్రభాస్ నీ సమస్య చెబితే పరిష్కరిస్తానని అన్నాడని ఆ సమయంలో ప్రభాస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని ప్రభాస్ ఓదార్పు చిన్న ఓదార్పు అయినా అండగా ఉంటాననే ఆ మాట చాలని జగపతిబాబు చెప్పుకొచ్చారు.
జగపతిబాబు వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.







