చెల్లెలిని గోడ్డళ్లతో నరికి చంపిన సోదరులు..అసలు ఏం జరిగిందంటే..?

ఈ మధ్యకాలంలో జరుగుతున్న వివాహాలలో సగానికి పైగా ప్రేమ వివాహాలే.( Love Marriage ) కొందరు ప్రేమికులు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకుంటే.

 Brothers Killed Sister For Loving Other Caste Person In Maharashtra Details, Bro-TeluguStop.com

మరికొందరు కుటుంబ సభ్యులను ఎదిరించి పారిపోయి మరి వివాహలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో కొంతమంది కుటుంబ సభ్యులు ప్రేమ వివాహం చేసుకున్న వారిపై పగలు పెంచుకొని దారుణాలకు పాల్పడుతున్నారు.

ఈ కోవలోనే ఓ యువతి వేరే కులం వ్యక్తిని ప్రేమించింది అనే కారణంతో సోదరులు గొడ్డళ్లతో నరికి సోదరిని కిరాతకంగా హత్య చేశారు.ఈ ఘటన మహారాష్ట్రలోని( Maharashtra ) ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Brothers, Sister, Love, Maharashtra, Person, Soyagao-Latest News - Telugu

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.సోయాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ గ్రామంలో మాయత్ చంద్రకళ( Mayath Chandrakala ) అనే యువతి అదే గ్రామానికి చెందిన వేరే కులం యువకుడిని ప్రేమించింది.కుటుంబ సభ్యులకు ప్రేమ వ్యవహారం తెలియడంతో ఆ యువతిని మందలించి తీవ్రంగా వ్యతిరేకించారు.

దీంతో ఆ యువతి ఇంట్లో నుండి ఆ యువకుడి వద్దకు వెళ్లి అతని ఇంట్లోనే సహజీవనం చేస్తోంది.ఈ విషయం ఆ యువతి ఇద్దరి సోదరులకు తెలియడంతో తమ పరువు తీసేసిందని, సోదరిని చంపేయాలని నిర్ణయించుకున్నారు.సోదరిని చంపాలని గొడ్డళ్లతో ఆమె ఉండే ఇంటికి బయలుదేరారు.

Telugu Brothers, Sister, Love, Maharashtra, Person, Soyagao-Latest News - Telugu

ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి సమీపంలో ఉండే ఒక మేకల కొట్టంలో దాక్కుంది.ఆ యువతి సోదరులు ఇంటితోపాటు చుట్టూ ఉండే పరిసరాలలో గాలించారు.చివరికి మేకల కొట్టంలో దాక్కుంది అని తెలియడంతో ఆమెను గొడ్డళ్లతో నరికి అత్యంత దారుణంగా హత్య చేశారు.

బాధితురాలికి సహాయం చేసేందుకు వచ్చిన వ్యక్తిపై కూడా నిందితులు దాడికి పాల్పడ్డారు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి.

ఆ యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube