చిత్తూరు కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇప్పటికే ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది.
తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
చందన అలంకారంతో స్వామివారు దర్శనమిస్తున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.వీఐపీ దర్శనానికి ఒకటిన్నర గంటల సమయం పడుతుండగా సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
మరోవైపు గణేశ దీక్ష తీసుకున్న భక్తులు ఇరుముడులను సమర్పిస్తున్నారు.భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.







